Share News

Peddapalli: పార్టీ గెలుపే కార్యకర్తల గెలుపుగా పనిచేయాలి

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:00 AM

ధర్మారం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో టెకెట్లు ఎవరికి వచ్చినా పార్టీ గెలవడమే అనివార్యమని, పార్టీ గెలుపే కార్యకర్తల గెలుపుగా పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజనశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

Peddapalli:  పార్టీ గెలుపే కార్యకర్తల గెలుపుగా పనిచేయాలి

- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మారం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో టెకెట్లు ఎవరికి వచ్చినా పార్టీ గెలవడమే అనివార్యమని, పార్టీ గెలుపే కార్యకర్తల గెలుపుగా పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజనశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాల యంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమా వేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోర్టు తీర్పు ఎలా ఉన్నా కార్యకర్తలంతా ఎన్నికలకు సన్నద్దం కావాలని సూచించారు. మండలం లోని 15ఎంపీటీసీ స్థానాలకు పోటీచేసే ఆశా వాహులు పార్టీఅధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డిని కలిసి తమ వినతిపత్రాలు అందజేయాలని తెలి పారు. అదేవిధంగా ఒక్కస్థానం నుంచి ఎంతమంది పోటీలో ఉన్నా అభ్యర్థనలు స్వీకరించాలని పార్టీ అధ్యక్షుడికి సూచించారు. ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థుల బలాబలాలను చూసుకొని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. టికెట్‌ ఎవరికి వచ్చినా కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని, టికెట్‌ రాని వారికి భవిష్యత్తులో నామినేటెడ్‌ పోస్టులతో సంతృప్తి పరిచే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ పచ్చని చెట్టు లాంటిదని పార్టీలో వర్గాలు ఏర్పరచి కూర్చున్న చెట్టునే నరుక్కోవద్దని హెచ్చరించారు. అంతకు ముందు జువ్వాడి రత్నాకర్‌రావు 98వ, జయంతి సంద ర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయనవెంట ఏఎంసీ చైర్మెన్‌ లావుడ్య రూప్లానాయక్‌, వైస్‌చైర్మెన్‌ అరిగె లింగయ్యా, మాజీఏఎంసీ చైర్మెన్‌ కొత్త నర్సింహులు, మాజీఏఎంసీ వైస్‌ చైర్మెన్‌ కాడె సూర్యనారాయణ, మాజీ వీఎస్‌ఎస్‌ చైర్మెన్‌ దేవి జనార్దన్‌, ధర్మపురి నియోజకవర్గ యూత్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌, కొండగట్టు దేవస్థాన మాజీ డైరెక్టర్‌ జక్కుల దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 12:00 AM