Peddapalli: మాదిగలను అవమానించిన మంత్రిని తొలగించాలి
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:21 AM
పెద్దపల్లిటౌన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) మాదిగల ఆత్మగౌరవాన్ని అవహేళన చేసిన మంత్రి పొన్నంప్రభాకర్ మాదిగలకు వెంట నే క్షమాపణ చెప్పాలని మంత్రిపదవి నుంచి తొలగించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
పెద్దపల్లిటౌన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) మాదిగల ఆత్మగౌరవాన్ని అవహేళన చేసిన మంత్రి పొన్నంప్రభాకర్ మాదిగలకు వెంట నే క్షమాపణ చెప్పాలని మంత్రిపదవి నుంచి తొలగించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోనీ కమాన్‌చౌరస్తాలో రాజీవ్ రహ దారిపై రాస్తారోకో చేపట్టి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనంచేసే క్రమంలో పోలీ సులు అడ్డుకున్నారు. అనంతరంవారు మాట్లాడుతూ మాదిగలకు క్షమాపణ చెప్పా లని లేనియెడల మందకృష్ణ మాదిగ నాయ కత్వంలో మరింత ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఎమార్పీఎస్ జిల్లాఅధ్యక్షుడు అంబాల రాజేం దర్, చందు, అంబాల నరేష్, పెరికసాగర్, కుక్కఅశోక్, పల్లె సదానందం, బొంకూరి నరేందర్, కుక్క శ్రీనాథ్, శ్రావణ్ కుమార్, కుక్కవంశీ, ఆరేపల్లివంశీ పాల్గొన్నారు.