Peddapalli: రామగుండాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:30 AM
అంతర్గాం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రామగుం డాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు.
అంజనాద్రిపై సత్యనారాయణ వ్రతం చేసిన ఎమ్మెల్యే దంపతులు
అంతర్గాం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రామగుం డాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. బీపవర్‌హౌస్ వద్ద ఉన్న రాముని గుండాలపై 108అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణం వద్ద బుధవారం సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్, మనాలీఠాకూర్ దంపతులు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అంజనాద్రిపై 108 అడు గుల ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఉత్తర తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా గోదావరి తీరప్రాంతం ఆధ్యాత్మి కంగా విరాజిల్లేందుకు శక్తికి మించి కృషిచేస్తున్నట్టు తెలిపారు. ఎత్తైన మహాశివుని విగ్రహంతో పాటు దుర్గామాత, మానసాదేవి, కామాక్షి అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠాపన చేస్తున్నట్టు చెప్పారు. సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.5కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు, గోలివాడ, ఈసాలతక్కళ్లపల్లి సమ్మక్క-సార లమ్మ జాతరలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్టు తెలిపారు. అదేవిధంగా అన్నిమతాల వారిని గౌరవిస్తూ చర్చిలు, మసీదులను కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రామగుండంలో గోదావరి నదీతీరాన ఎకరం స్థలంలో వేద పాఠశాలను నిర్మించనున్నట్టు చెప్పారు. అనంతరం భక్తులతో కలిసి కార్తీక వనభోజనాల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు.