Share News

Peddapalli: ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:19 AM

యైుటింక్లయిన్‌కాలనీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పేళ్లులను నిరిస్తూ బుధవారం తెలంగాణ చౌర స్తాలో కాంగ్రెస్‌నాయకులు ఉగ్రవా దుల దిష్టిబొమ్మను దహనం చేశారు.

 Peddapalli:  ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం

యైుటింక్లయిన్‌కాలనీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పేళ్లులను నిరిస్తూ బుధవారం తెలంగాణ చౌర స్తాలో కాంగ్రెస్‌నాయకులు ఉగ్రవా దుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉగ్రవాదుల చర్యలు దేశ సమగ్రతను దెబ్బతీయ లేవని నాయకులు అభిప్రాయపడ్డారు. కేంద్రప్రభుత్వం ఉగ్రవాదాన్ని అరిక ట్టడంలో విఫలమైన కారణంగానే ఈబాంబు పేలుళ్లు జరిగినట్టు తెలిపారు. మరిన్ని ఉగ్ర ఘటనలు జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ పట్ట అధ్యక్షుడు పరకాల ప్రశాంత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈనిరసనలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్‌, జిల్లాఉపాధ్యక్షుడు మారెల్లి రాజిరెడ్డి, నాయకులు సాగంటి శంకర్‌, చక్రపాణి, చాట్ల సదానందం, అనుము రాములు, పాల్గొన్నారు.

కళ్యాణ్‌నగర్‌ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ బుధవారం గోదావరిఖని చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి దాడుల్లో మృతిచెందిన వారికి నివాళులర్పించారు. యూత్‌కాంగ్రెస్‌ నాయకులు మెంటెం ఉదయ్‌రాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్‌నగర అధ్య క్షుడు బొంతల రాజేష్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో దాడులకు తెగబడిన ఉగ్ర వాదులను క్షేత్రస్థాయిలో అంతం చేయాలని అన్నారు. నిఘా సంస్థలు ఉగ్రవాదుల దాడులు జరుగుతాయని చెప్పినప్పటికీ హోంశాఖ మంత్రి పట్టించుకోలేదన్నారు. నిరసనలో కాంగ్రెస్‌ నాయకులు కాల్వ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్‌, నాయిని ఓదెలు, పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:19 AM