Share News

Peddapalli: భావి తరాలకు స్ఫూర్తినిచ్చేది ఉపాధ్యాయులే

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:06 AM

మంథని, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): భావితరాలకు స్ఫూర్తినిచ్చేది ఉపాధ్యాయులేనని మంథని సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న అన్నారు.

Peddapalli:  భావి తరాలకు స్ఫూర్తినిచ్చేది ఉపాధ్యాయులే

ప్యాక్స్‌, ఏఎంసీ చైర్మన్లు కొత్త శ్రీనివాస్‌, కుడుదుల వెంకన్న

మంథని, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): భావితరాలకు స్ఫూర్తినిచ్చేది ఉపాధ్యాయులేనని మంథని సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించు కొని మండల పరిషత్‌ కార్యాలయంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్న గీట్ల భరత్‌రెడ్డిని, మండ లస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు బహుత్‌ కిషోర్‌, ఈర్ల రమేష్‌, మద్ది రాము, ధనశ్రీ, నారమల్ల లక్ష్మణ్‌, బోగె చంద్ర శేఖర్‌, సురేష్‌, శిరీష, పద్మ, శ్రీదేవీ, వామనమూర్తి, కిన్నెర శ్రీనివాస్‌, సీఆర్పీ స్వప్నను గురువారం వారు సన్మానించారు. ఈ సందర్భంగా వారిని శాలువాలు, మెమెంటోలతో సన్మానిం చారు. కార్యక్రమంలో టీఈఆర్‌సీ మెంబర్‌ శశిభూషన్‌కాచే, ఆర్టీఏ మెంబర్‌ మంథని సురేష్‌, తహశీల్దార్‌ కుమారస్వామి, ఎంపీవో అనీల్‌రెడ్డి, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు ఈదులపల్లి నర్సింగరావు, డాక్టర్‌ జే సురేష్‌కుమార్‌, మోసం శ్రీనివాస్‌, టీచర్లు బోనాల రవీందర్‌, సీఆర్పీలు మల్లన్న, ఎర్రం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 12:06 AM