Share News

Peddapalli: బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ విద్యార్థులు తల్లిదండ్రుల రాస్తారోకో

ABN , Publish Date - Oct 09 , 2025 | 12:24 AM

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 8 (ఆంధ్ర జ్యోతి): బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి రాస్తారోకో చేశారు.

 Peddapalli:  బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ విద్యార్థులు తల్లిదండ్రుల రాస్తారోకో

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 8 (ఆంధ్ర జ్యోతి): బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి రాస్తారోకో చేశారు. బెస్ట్‌ అవై లబుల్‌ స్కూల్‌ఫీజులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశా రు. రాస్తారోకోతో రాజీవ్‌ రహదారిపై రాక పోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పెద్దపల్లి పట్టణ ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు పోలీస్‌సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళన కారులను సముదాయించి రాస్తారోకో విరమింప జేశారు. దీంతో రాకపోకలు యథావిధిగా కొన సాగాయి. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదం డ్రులు మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు తమ పిల్లలను పాఠశాలకు రానివ్వడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ ఫీజులు చెల్లించి తమపిల్లల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వీరి ఆందోళనకు విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు పలికారు. ఆందోళనలో సంఘాల నాయకులు బాలసాని లెనిన్‌, స్టాలిన్‌, సీపెల్లి రవీందర్‌, మోదుంపల్లి శ్రావణ్‌, కల్లేపల్లి అశోక్‌, విద్యార్థులు, తల్లి దండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 12:24 AM