Share News

Peddapalli: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:07 AM

పెద్దపల్లి, అక్టోబరు 30 (ఆంఽధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టచర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

Peddapalli:  రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

- జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, అక్టోబరు 30 (ఆంఽధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టచర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, స్థానికసంస్థల అదనపుకలెక్టర్‌ జె అరుణశ్రీ, డీసీపీ కరుణాకర్‌, టైన్రీ డిప్యూటీ కలెక్టర్‌ బి వనజతోకలిసి రోడ్డుప్రమాదాల నియంత్రణపై సమీక్ష నిర్వహిం చారు. ఈ సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ బసంత్‌నగర్‌లో మరో 2చోట్ల 5లక్షల రూపాయలతో హైమాస్‌లైటింగ్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డుపై వాహనాల వేగాన్ని తగ్గించేందుకు అవసరమైన మేర స్ర్పింక్లర్స్‌ ఏర్పా టు చేయాలని అన్నారు. రోడ్డుపై పశువులు విడిచిపెట్టే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ 10వేలరూపాయల జరిమానా విధించాలని, పశువులను గోశాల లకు తరలించాలని అన్నారు. జిల్లాలో ట్రాఫిక్‌నియంత్రణకు చర్యలు తీసుకోవా లని అన్నారు. హెచ్‌.కే.ఆర్‌ సిబ్బంది మున్సిపల్‌ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసు లతో సమన్వయం చేసుకుంటూ పెద్దపల్లిపట్టణ పరిధిలో ట్రాఫిక్‌ నియంత్ర ణకు అవసరమైన మేర రోడ్డువిస్తరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రామగుండంలో అవసరమైన చోట సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా గతసంవత్సరం జరిగిన ప్రమాదాలపై రిపోర్ట్‌ అందించాలని అన్నారు. ప్రతిపాఠశాలవద్ద స్కూల్‌జోన్‌ బోర్డులు ఉండా లన్నారు. హిట్‌అండ్‌రన్‌ కేసుల బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ప్రతిపాదనలు త్వరగా పంపాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. హెల్మెట్‌ ధరించకపోవడం, త్రిబుల్‌ రైడింగ్‌, మద్యం తాగి వాహనం నడపడం, సీట్‌ బెల్ట్‌ ధరించడం మొబైల్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం వంటివి ప్రమాదకరమని, చట్ట ప్రకారం నేరమని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకునేలా చర్యలు..

పెద్దపల్లి కల్చరల్‌ : జిల్లాలోని అనాథ, తల్లిదండ్రులు లేని పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం ఆయన జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటులో ఐసీపీఎస్‌ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అనాథ, పాక్షిక అనాథ పిల్లలను పూర్తిస్థాయిలో గుర్తించాలన్నారు. పిల్లల తల్లిదండ్రుల పేరుమీద ఏమైనా ఆస్తులు ఉంటే అన్యాక్రాంతం కాకుం డా వారికి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వారికి పూర్తి స్థాయిలో విద్యను అందించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా సంక్షేమ శాఖ నుంచి వచ్చే అనాథపిల్లల జాబితాను ఆమోదించి కేజీబీవీలు, గురుకులాల్లో చేర్పించాలన్నారు. చైల్డ్‌కేర్‌ టోల్‌ఫ్రీనంబర్‌ 1098కు వచ్చే ప్రతి ఫిర్యాదును స్వీకరిం చాలని ఆదేశించారు. బాలసదనంలోని పిల్లలు కింద పడుకోకుండా వారికి బెడ్లుఏర్పాటు చేయాలన్నారు. స్నాక్స్‌అందించాలన్నారు. సుల్తానాబాద్‌లో మంజూరైన బాలసదనం పనులు డిసెంబర్‌ చివరికి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమఅధికారి వేణుగోపాల్‌ రావు, సంబంధిత అధికా రులు పాల్గొన్నారు.

డిసెంబర్‌ చివరికి పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

పెద్దపల్లి కల్చరల్‌: జిల్లాలో చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులు డిసెం బర్‌ చివరి వరకు పూర్తిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో చేపట్టిన పలుఅభివృద్ధి పను లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే 5నుంచి 10ఏళ్ల వరకు అవసరాలకు దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీకేంద్రాల్లో చేపట్టిన అభివృద్ది పనులను యుద్ధప్రాతిపాదికన డిసెంబర్‌ చివరికి పూర్తిచేయాలన్నారు. జిల్లాలో మంజూ రుచేసిన తహసీల్దార్‌ కార్యాలయం పనులువేగవంతం చేయాలన్నారు. సమా వేశంలో పీఆర్‌ ఈఈ గీరిష్‌ బాబు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:07 AM