Peddapalli: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:25 AM
పెద్దపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయా లని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని అన్నారు.
- రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని
పెద్దపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయా లని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై బుధవారం సాయంత్రం ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొదటివిడత ఎన్నికల నోటిఫి కేషన్ అక్టోబర్ 9నఉదయం 10:30గంటల వరకు విడుదల చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు ఎంపీటీసీ జడ్పీటీసీ పరిధిలోని ఓటరుజాబితా వివరా లను ప్రచురించాలని అన్నారు. అక్టోబర్9 నుంచి అక్టోబర్11 వరకు ప్రతిరోజు ఉదయం 10:30నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని అన్నారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 12న సాయంత్రం 5గంటల వరకు పూర్తిచేసి చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబి తాను ప్రకటించాలని అన్నారు. అభ్యర్థుల జాబితాపై అప్పీల్ కోసం అక్టోబర్13 సాయంత్రం 5గంటల వరకు గడువు ఉంటుందని, అక్టోబర్14న అప్పీళ్లు పరిష్కరిం చాలని, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్15 మధ్యా హ్నం 3గంటల వరకు గడువు ఉంటుందని అన్నారు. అదే రోజు పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రచురించాలని అన్నారు. అనంతరం, గుర్తులు కేటాయించాలన్నారు. జిల్లాకలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మొదటివిడతలో పెద్దపల్లి జిల్లాలో 68 ఎంపీటీసీ, 7జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. రిటర్నింగ్ అధికారులకు, ఇతర సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించేందుకు పట్టిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీసీపీ కరుణాకర్, అదనపుకలెక్టర్ అరుణశ్రీ, జడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీర బుచ్చయ్య, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.