Share News

peddapalli : జోరుగా కల్తీ మద్యం...

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:35 AM

కోల్‌సిటీ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కల్తీ మద్యం అమ్మకాలు పెరిగాయి... ఎక్సైజ్‌ శాఖ నిఘా లేక పోవడంతో అమ్మకాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో కల్తీ మద్యం విక్రయాలు కూడా అదే స్థాయిలో పెరుగుతు న్నాయి.

peddapalli :  జోరుగా కల్తీ మద్యం...

- లైసెన్స్‌ గడువు దగ్గర పడుతున్నా కొద్ది పెరుగుతున్న కల్తీ

- దసరా పండుగ దగ్గర పడుతుండడంతో బెల్ట్‌ షాపులకు తరలుతున్న మద్యం...

- మంత్రి ఆదేశించినా తనిఖీలపై దృష్టి పెట్టని ఎక్సైజ్‌శాఖ

- మద్యం ప్రియుల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం

కోల్‌సిటీ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కల్తీ మద్యం అమ్మకాలు పెరిగాయి... ఎక్సైజ్‌ శాఖ నిఘా లేక పోవడంతో అమ్మకాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో కల్తీ మద్యం విక్రయాలు కూడా అదే స్థాయిలో పెరుగుతు న్నాయి. ముఖ్యంగా రాత్రిపూట జరిగే విక్రయాల్లో కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని, గోదావరిఖని ఎక్సైజ్‌స్టేషన్ల పరిధిలో 77వరకు వైన్‌షాపులు, బార్లు ఉన్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 27 రిటైల్‌ షాపులు, పది బార్లు ఉన్నాయి. జిల్లాలో రెండు మద్యం షాపులు రోజుకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు అమ్మకాలు జరిపే కౌంటర్లు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపునకు 60 నుంచి 70వరకు బెల్ట్‌షాపులు ఉన్న పరిస్థితి ఉంది. కొత్త మద్యం పాలసీలో లాభదా యకంగా ఉండడంతో వ్యాపారులు కూడా అమ్మకాలపై దృష్టి పెట్టారు. నవంబర్‌తో మద్యం లైసెన్స్‌ గడువు ముగుస్తుంది. దీంతో ఈ రెండు నెలల్లో అమ్మకాలపై దృష్టి పెట్టిన కొందరు వ్యాపారులు కల్తీ మద్యం అమ్మ కాలు సాగిస్తున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వ్యాపారులు బెల్ట్‌షాపులకు హోల్‌సేల్‌ కౌంటర్‌, రిటైల్‌ కౌంటర్లు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా మద్యం అమ్మ కాలు జరిగే బ్రాండ్‌లను కల్తీ చేసి బెల్ట్‌షాపులకు పంపు తున్నారు. రిటైల్‌ మద్యం దుకాణాల్లో సైతం ఏ రోజుకా రోజు కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారనే విమర్శలున్నాయి. కొన్ని మద్యం షాపుల్లో సీసాల క్యాప్‌ లు ఓపెన్‌ చేసి నీరు, తక్కువ ధర మద్యాన్ని పోసి నింపుతున్నారు. కొందరు షాపుల నిర్వాహకులైతే ఇతర ప్రాంతాల నుంచి ఖాళీ క్యాప్‌లు తెప్పించుకుని సీసా లకు బిగిస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా రాత్రిపూట జరిగే మద్యం విక్రయాల్లో ఈ కల్తీ మద్యం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. మద్యంకు సంబంధించి చీప్‌ లిక్కర్‌, మీడియం రేంజ్‌, ప్రీమియం రేంజ్‌ క్యాటగిరి లుగా ఉంటాయి. ఎక్కువగా అమ్మకాలు జరిగే ప్రీమి యం రేంజ్‌ విస్కిలలో చీప్‌ లిక్కర్‌, ఇతర విస్కీలు పోసి అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో పెద్దపల్లి పట్టణంతో పాటు సుల్తానాబాద్‌, గోదావరిఖని ప్రాంతాల్లో పోలీస్‌, టాస్క్‌ఫోర్స్‌, స్టేట్‌ ఎక్సైజ్‌ టాస్క్‌ ఫోర్స్‌లు దాడులు చేసి కల్తీ మద్యాన్ని పట్టుకున్నాయి. షాపులను సీజ్‌ చేశాయి. ఈ ఏడాది జిల్లాలో మద్యం తనిఖీలు నామమాత్రంగా కూడా సాగడం లేదనే విమర్శలున్నాయి.

మంత్రి ఆదేశించినా... కదలని ఎక్సైజ్‌శాఖ

జిల్లాలో కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలపై దృష్టి పెట్టాలని, రోజు మద్యం దుకాణాలను తనిఖీ చేయాలని ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశిం చారు. ముఖ్యంగా దసరా దృష్టిలో ఉంచుకుని కల్తీ మద్యం విక్రయాలు లేకుండా తనిఖీలు జరుపాలని పేర్కొన్నారు. కేవలం నామ మాత్రంగా తనిఖీలు జరిపి ఫొటోలతో అధికారులు గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన తనిఖీలకు సంబంధించి ఒక రోజు ముందుగానే షాపు యజమానులకు సమాచారం తెలి సిందంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. సాధార ణంగా మద్యం తనిఖీలకు సంబంధించి థర్మోమీటర్‌, హైడ్రోమీటర్‌తో పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మ ద్యంలో నీటితో కల్తీ చేస్తే టెంపరేచర్‌లో తేడా వస్తుంది. దీనిని థర్మోమీటర్‌తో గుర్తిస్తారు. మద్యం నాణ్యతకు సంబంధించి హైడ్రోమీటర్‌ పరీక్షల్లో తేలుతుంది. ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌, స్టేట్‌ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు లేక పోవడం, స్థానిక ఎక్సైజ్‌ అధికారులకు, వ్యాపారులకు నెలవారి ఒప్పందాలతో ఈ కల్తీ దందా వ్యాపారం సాగుతుందనే విమర్శలున్నాయి.

ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం

కల్తీ మద్యం సేవించడం వల్ల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇటీ వల కాలంలో మద్యం సేవించే వారిలో కాలేయ సమ స్యలు, శ్వాస, జీర్ణకోశ సమస్యలు ఎక్కువగా గుర్తిస్తు న్నట్టు వారు పేర్కొన్నారు. ఆల్కహాల్‌ పర్సంటేజీ ఎక్కు వైన సందర్భంలోనే ఇలాంటి పరిణామాలు జరుగు తాయని, ఇవి రక్తపోటు, కంటి చూపు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు.

Updated Date - Sep 22 , 2025 | 12:35 AM