Peddapalli: యువత ఉపాధి కల్పనకు చర్యలు: కలెక్టర్
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:30 AM
పెద్దపల్లి కల్చరల్, నవం బరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నా రు.
పెద్దపల్లి కల్చరల్, నవం బరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నా రు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాస్థాయి జాబ్‌మేళా నిర్వ హణపై పలు కళాశాలల యాజమాన్యాలు, అధికారు లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా టాస్క్ రీజినల్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జాబ్‌మేళా నిర్వహించాలని నిర్ణ యించినట్లు తెలిపారు. షెడ్యూల్ ఖరారు కాగానే కళాశాలలకు సమాచారం అందిస్తా మని పేర్కొన్నారు. మంథనిలో మరో టాస్క్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామ న్నారు. డిగ్రీ పూర్వవిద్యార్థులు, ఫైనల్ ఇయ ర్ చదువుతున్న కనీసం 50మంది జాబ్ మేళాకు హాజరుకావాలని, ప్రతికళాశాల నుంచి ఒక కోఆర్డినేటర్‌ను నియమించాలని కలెక్టర్ సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు
చర్యలు తీసుకోవాలి..
పెద్దపల్లిటౌన్: జిల్లాలో రోడ్డు ప్రమా దాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకో వాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన రోడ్డుప్రమాదాల నియంత్రణ చర్య లపై స్థానికసంస్థల అదనపుకలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లపైకి పశువులు రాకుండాచూడాలని, పశువుల యజమాను లకు పక్కా సూచనలు జారీ చేయాలన్నారు. రోడ్ల వద్ద వాహనాల వేగం నియంత్రణ కోసం బ్లాక్ స్పాట్స్ వద్ద రేడియం స్టిక్క ర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆటోలను మైనర్‌లు నడుపుతున్నట్లు సమాచారం ఉందని, దీనిని రెగ్యులర్‌గా ట్రాక్‌చేయాలని ట్రాఫిక్ అధికారులకు సూచిం చారు. రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు వైద్యఖర్చులు నిమిత్తం కలెక్ట రేట్ వద్ద ప్రత్యేక ఖాతా ప్రారంభించే పని చేపట్టామని తెలిపారు. మల్లెపల్లి నుంచి గుంజపడుగు, ఆరెంద, నాగపల్లి రోడ్డు, ఇతర రోడ్డుమరమ్మతు పనుల ప్రతిపాదనలు వెం టనే సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారు లను ఆదేశించారు. నూతన రోడ్ల నిర్మాణానికి అడ్డుగాఉన్న విద్యుతు స్తంభాలను ప్రాధా న్యత క్రమంలో షిఫ్టింగ్‌చేయాలని పేర్కొ న్నారు. సమావేశంలో ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఈ,ఈ బావ్ సింగ్, మున్సిపల్‌కమిషనర్లు వెంకటేష్, మనో హర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.