Peddapalli: రాజ్యాంగ స్ఫూర్తి సాధన దిశగా అడుగులు వేయాలి
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:51 AM
పెద్దపల్లి కల్చరల్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగస్ఫూర్తి సాధన దిశగా మనమంతా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు.
పెద్దపల్లి కల్చరల్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగస్ఫూర్తి సాధన దిశగా మనమంతా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అంబేద్కర్ చిత్రపటా నికి, భారతరాజ్యాంగ పుస్తకానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భం గా రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞను చేయించారు. 2015నుంచి రాజ్యాంగ దినోత్స వం జరుపుకుంటున్నామని అన్నారు. కార్యక్ర మంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సి విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, కలెక్టరేట్ సిబ్బంది తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాజ్యాంగ విలువలను పాటించాలి..
పెద్దపల్లిటౌన్: రాజ్యాంగ విలువలను పాటిస్తూ ముందుకుసాగాలని జడ్జీలు కుంచాల సునీతా, కుంచం సప్న అన్నారు. గాయత్రి విద్యానికేతన్‌లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడారు. విద్యార్థులకు భారతరాజ్యాంగం ప్రాముఖ్యత, న్యాయవ్యవస్థ పాత్ర, పౌరుల హక్కులు బాధ్యతలు గురించి ప్రేరణాత్మక సందేశాలు అందజేశారు. వ్యాసరచన పోటీలో విజేత లుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజే శారు. కార్యక్రమంలో ఎన్ శ్రీనివాస్, కె శ్రీధర్, లోక్‌అదాలత్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
కోల్‌సిటీటౌన్: గోదావరిఖనిలో ఆలిండియా అంబే ద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణకమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంముందు వేడుకలు నిర్వహిం చారు. రామగుండం మాజీఎమ్మెల్యే కోరుకంటి చందర్, కాంగ్రెస్‌పార్టీ మాజీఫ్లోర్‌లీడర్ మహంకాళిస్వామి, కాంగ్రెస్‌పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, సీపీఐ నాయకులు తాండ్ర సదానందం, బీజేపీ పార్టీ రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి, బీఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల రాజనర్సయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్‌చేశారు. పలువిద్యాసంస్థల్లో సైతం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు.
ఎలిగేడు: మండలకేంద్రంలో అంబేద్కర్ చిత్రపటా నికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో అంబేద్కర్‌సంఘం నాయకులు కవ్వంపల్లి బాప య్య, కవ్వంపల్లి చంద్రయ్య, న్యాతరి పోచయ్య, జల్లి రమేష్, మద్దెల సంపత్, కప్పల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్: రాజ్యాంగఫలాలు సామాన్య ప్రజ లకు అందాలని ఆర్ట్స్‌కాలేజీ రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్ డాక్టర్‌వీరస్వామి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశా లలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ అవగాహన సద స్సును ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహిం చారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు వీరస్వామిని ఘనంగా సన్మానించారు. సమావేశంలో లెక్చరర్లు మాధవిలత, సునీల్, నిర్మల, అరుణ, శ్రీనివాస్, విక్రమాదిత్య, సాయి వంశీ పాల్గొన్నారు.
ఓదెల: మండలంలోని కొలనూర్ గ్రామకూడలిలో ఉన్న అంబేద్కర్‌విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్ మాటూరి రత్నం, పల్లె సుమన్, పూరెళ్ళ స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్ కమిషనర్ మారుతిప్రసాద్ మున్సిపల్ అధి కారులు, సిబ్బంది విద్యార్థినులతో రాజ్యాంగ ప్రాదేశిక పత్రాలను చదివించారు. కార్యక్రమంలో ఈఈ రామన్, సెక్రెటరీ ఉమా మహేశ్వర్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
జ్యోతినగర్: ప్రతిపౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవించాలని, రాజ్యాంగసూత్రాలను పాటించాలని రామగుండం ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా బుధవారం ఎన్‌టీపీసీ కాకతీయఆడిటోరియంలో జరిగిన కార్యక్ర మంలో ఆయన ప్రసంగించారు. పౌరుల హక్కులు, బాధ్యతలు, వ్యవస్థఉన్నతమైన మార్గంలో పయనిం చేలా మనరాజ్యాంగాన్ని రచించారన్నారు. సచ్‌దేవా పాఠశాలవిద్యార్థులు రాజ్యాంగం గురించిస్కిట్‌ను ప్రద ర్శించారు. కార్యక్రమంలో పలువిభాగాల జీఎంలు, అధి కారులు, ఉద్యోగులు,మహిళలు,విద్యార్థులు పాల్గొన్నారు.
కమాన్‌పూర్: అందరి ఆరాధ్యదైవం బాబా సాహెబ్ అంబేద్కర్ అని జూలపల్లి మాజీసర్పంచ్ గొల్లపల్లి శంకర్‌గౌడ్, అంబేద్కర్ అవార్డు గ్రహీత ఇరుగురాళ్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని జూలపల్లి గ్రామపరిధిలోని ఆదర్శనగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
మంథనిరూరల్: మండలంలోని గుంజపడుగులోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో, బస్టాండువద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్కసదానందం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో రాజ్యాంగ పీఠిక చదివించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ హెచ్‌ఎం శివలీల, ఉపాధ్యాయులు కర్రు సురేష్, రవి, స్వామి, నరేందర్, మాజీ సర్పంచ్‌కుంట రాజు పాల్గొన్నారు.
ముత్తారం: రాజ్యాంగవిలువల మీద అవగాహన కలిగిఉంటే అత్యున్నతపౌరులుగా ఎదుగుతారని కస్తూ ర్బాస్పెషల్‌ఆఫీసర్ స్వప్నఅన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఆమె పూలమాలలు వేశారు.