Share News

Peddapalli: యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:37 AM

పెద్దపల్లిటౌన్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో యూరియా కొరత, రైతులు పడుతున్న గోసకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టి ముక్కుల సురేష్‌రెడ్డి ఆరోపించారు.

Peddapalli: యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్‌

పెద్దపల్లిటౌన్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో యూరియా కొరత, రైతులు పడుతున్న గోసకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టి ముక్కుల సురేష్‌రెడ్డి ఆరోపించారు. ఆది వారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు 6లక్షల 12వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం పంపించినట్లు తెలి పారు. ఇప్పటికే రాష్ట్రం వద్ద ఒక లక్ష 76వేల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, అయినా యూరియా కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. రైతులకు యూరియా సరిగా సరఫరా చేయలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారని నిలదీశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభు త్వంలో సైతం యూరియా అడిగిన రైతులకు బేడీలు వేసి జైళ్లకు పంపించిన ఘనతను మూటగట్టుకుందని గుర్తుచేశారు. రైతుల కన్నీళ్లతో కాలం వెళ్ళదీస్తున్న ఇరు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చ రించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీజేపీ సుల్తానాబాద్‌ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్‌, జీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు కనుకుంట్ల జోగేందర్‌, బొడ్డుపల్లి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 12:37 AM