Peddapalli: రామగుండంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:18 AM
కోల్‌సిటీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రామగుం డంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సూచించారు.
అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్
కోల్‌సిటీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రామగుం డంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సూచించారు. గురువారం ఎమ్మెల్యేక్యాంపు కార్యాల యంలో అధికారులతో సమీక్షసమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిపను లను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఈఈ రామన్, డీఈ జమీల్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ డీఈ, ఏఈలు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్యసేవలందించండి..
కళ్యాణ్‌నగర్: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ వైద్యులకు సూచించారు. గురువారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటీవల కత్తిపోట్లకు గురైన చికిత్స పొందుతున్న కుమారస్వామిని పరామర్శించారు. అతడికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట ఆర్‌ఎంవో రాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ ఉన్నారు.