Peddapalli: సారూ.. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించరూ..
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:49 PM
ముత్తారం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సారూ మాకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించండంటూ మండ లంలోని పారుపల్లి పంచా యతీ పరిధి శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన గిరి జనులు వేడుకుంటున్నారు.
- నిలువ నీడ కల్పించాలని గిరిజనుల వేడుకోలు
ముత్తారం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సారూ మాకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించండంటూ మండ లంలోని పారుపల్లి పంచా యతీ పరిధి శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన గిరి జనులు వేడుకుంటున్నారు. మారుమూల అటవీ ప్రాం తంతో కూడిన ఈ గ్రామం చుట్టూ కొండలు, గుట్టలు, పక్కనే మానేరు వాగు ఉంది. వాగు ఒడ్డున ఉన్న పూరిగుడిసెలో ఉంటున్న తమకు గూడు ఇప్పించి నీడకల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందించి అటవీగ్రామంలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ వేడుకుంటు న్నారు. గ్రామంలో సుమారుగా 50నిరుపేద ఎస్సీకుటుంబాలతోపాటు మరో ఐదుఎస్టీ కుటుంబాలు నివాసాముంటున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావంతో ఉన్న తమకు ఇందిరమ్మ ఇల్లు మాత్రం అందనిద్రాక్షలా మారిందని వారు ఆవేదన చెందుతు న్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఒక్క నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేయలేదని వారు నిరాశ చెందుతున్నారు. తమ దయనీయస్థితిని గమనించి మంత్రి శ్రీధర్‌బాబు స్పందిం చాలని వారు వేడుకుంటు న్నారు.
ఫ ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నాం..
- మేకల లక్ష్మిమల్లు, శాత్రాజుపల్లి
మాది నిరుపేద కుటుంబం. పూరి గుడి సెలో నివాసముంటున్నాం. ఎండకు ఎం డుతూ వానకు తడుస్తూ జీవించాల్సిన పరి స్థితి ఉంది. ఇంది రమ్మఇల్లు వస్తుందనుకుంటే నిరాశేమిగిలింది. నిరుపేదనైన తనకు ప్రభుత్వం ఇందిరమ్మఇల్లు ఇప్పించాలి.
ఫ కవరు గుడిసే దిక్కు..
- బీముని శారద, శాత్రాజుపల్లి
మా నిరుపేదరిక కుంటుంబానికి కవరు గుడిసెనే దిక్కు. ఎండైనా, వానైనా ఇందులోనే తలదాచుకుంటున్నాం. రాత్రిళ్లు ఏ విషపురుగు ఎటునుంచి వచ్చి కాటువేస్తుందోనని దినదిన గండంగా గడుపుతున్నాం. నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. నాకు ఇంటిని కేటాయిస్తే ప్రభు త్వానికి రుణపడి ఉంటా.