Peddapalli: ఎన్టీపీసీ గ్రీన్‌ఎనర్జీతో సింగరేణి ఒప్పందం
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:25 AM
గోదావరిఖని, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ అమ్మకంలో ఎన్‌టీపీసీ గ్రీన్‌ఎనర్జితో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధపడ్డది.
ప్రాజెక్టుల నిర్మాణం, విక్రయాల్లో పరస్పర సహకారానికి అంగీకారం
గోదావరిఖని, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ అమ్మకంలో ఎన్‌టీపీసీ గ్రీన్‌ఎనర్జితో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధపడ్డది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సింగరేణిభవన్‌లో ఎన్‌టీపీసీ గ్రీన్‌ఎనర్జీ అధికారులతో సింగరేణి సీఎండీ కీలక ఒప్పందం చేసుకున్నారు. సింగరేణి సంస్థ పునరుత్పాదకత ఇంధన రంగంలో విద్యుత్ ప్రాజెక్టులను పెద్దఎత్తున చేపడుతున్నది. ఈ క్రమంలో జాతీయ విద్యుత్‌ఉత్పత్తి సంస్థ ఎన్‌టీ పసీ అనుబంధ కంపెనీ అయిన ఎన్‌జీఈఎల్ (ఎన్‌టీపీసీ గ్రీన్‌ఎనర్జీలిమిటెడ్)తో కలిసి ప్రయా ణం చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో సీఎండీ బలరాంతోపాటు డైరెక్టర్లు, ఎన్‌జీఈఎల్ పక్షాన ఉన్నతాధికారులు ఆర్ మౌర్య, బిమల్ గోపాలచారి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎండీ బలరాం ఒప్పంద వివరాలను వెల్లడించారు. సింగరేణి వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా పునరుత్పాదక ఇంధనరంగంలో ప్లాంట్ల ను నెలకొల్పాలని నిర్ణయించిందని, జాతీయ స్థాయిలో విద్యుత్ ఉత్పాద నలో దశాబ్దాల అనుభవం ఉన్న ఎన్‌టీపీసీ సహకా రాన్ని తీసుకోవాలనుకున్నా మన్నారు. ఎన్‌టీపీసీ అను బంధంగా గ్రీన్‌ఎనర్జీ ఉత్పా దన కోసం ఏర్పాటుచేసిన గ్రీన్ ఎనర్జి లిమిటెడ్ సంస్థ తో ఒప్పందం చేసుకోవడం కీలకమైన సందర్భమని చెప్పారు. భవిష్యత్‌లో సింగరేణి గ్రీన్‌ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను విక్రయించ డంలో ఎన్‌టీపీసీ సహకారం తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్‌టీపీసీ అధికారులు బిమల్ గోపాల్‌చారి, ఆర్‌మౌర్య మాట్లాడుతూ సింగరేణి బొగ్గుఉత్పత్తితోపాటు గ్రీన్‌ఎనర్జి రంగం లోకి ప్రవేశించడం శుభపరిణామమన్నారు. ఇరు వురి పరస్పర సహకారం, భాగస్వామ్యంతో దేశ విదేశాల్లో గ్రీన్‌ఎనర్జీప్లాంట్లను ఏర్పాటు చేస్తా మని చెప్పారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు తిరుమల్‌రావు, ఈడీ ఎన్‌టీపీసీ చిరంజీవులు, జీఎం(కో ఆర్డినేషన్) తాడబోయిన శ్రీనివాస్, జీఎం విశ్వనాథరాజు పాల్గొన్నారు.
నాణ్యమైన బొగ్గు సరఫరాకు పటిష్ట చర్యలు
సింగరేణి బొగ్గు రక్షణతోపాటు నాణ్యతకు సమ ప్రాధాన్యం ఇస్తూ వినియోగదారుల వాణిజ్య విజయాలను తమవిజయంగా బావిస్తోందని సీఎండీ ఎన్ బలరామ్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో జరిగిన నాణ్యతవారోత్సవాల ముగింపు సమావే శంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సింగరేణిలో బొగ్గు నాణ్యతను పెంచడానికి పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటించిన శ్రీరాంపూర్, రామగుండం-2, మందమర్రి ఏరియాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను సీఎండీ బల రామ్ అందజేశారు. కార్యక్రమంలో సింగరేణి డైరె క్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్‌డైరెక్టర్ (కోల్ మూమెంట్) బీ వెంకన్న డైరెక్టర్(ఈఅండ్‌ఎం) ఎం తిరుమలరావు, జనరల్ మేనేజర్(క్వాలిటీ) కార్పొరేట్ కే వెంకటరమణ, జీఎం(కో ఆర్డినేషన్) టీ శ్రీనివాస్, ఏరియాల జీఎంలు, రీజినల్ క్వాలిటీ జీఎంలు పాల్గొన్నారు.