Peddapalli: సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:50 PM
కాల్వశ్రీరాంపూర్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆయా గ్రామపంచాయతీల్లో గెలు పొందిన సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు.
- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు
కాల్వశ్రీరాంపూర్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆయా గ్రామపంచాయతీల్లో గెలు పొందిన సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. శుక్రవారం కాంగ్రెస్‌పార్టీకి చెందిన 18మంది సర్పంచ్‌లు గెలువగా, వారితోపాటు వార్డుమెంబర్లను ఎమ్మెల్యే ఘనంగా సన్మానిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్‌లు గ్రామాల్లో వీదిలైట్లు, శానిటేషన్, తాగునీరు విష యాల్లో ప్రత్యేకశ్రద్ధ చూపాలన్నారు. సేవాగుణం తో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో మాజీఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, ఏఎంసీచైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతో
గ్రామాల అభివృద్ధి..
సుల్తానాబాద్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించు కోవడం ద్వారా గ్రామాలు అభివృద్ధి పథంలో పయ నిస్తాయని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం ఐతురాజుపల్లి, భూపతిపూర్, నరసయ్య పల్లి, బొంతకుంటపల్లి, కందునూరుపల్లి, నారా యణపూర్, చిన్న బొంకూ రు తదితర గ్రామాల్లో గురువారం ఆయన ఇం టింటికి ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం,సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తాము బలపరిచే వారిని గెలి పించి మీ గ్రామాలను అబివృద్ధి చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌చైర్మన్ మిను పాల ప్రకాశ్‌రావు, పన్నాల రాములు, పడాల అజయ్, తిరుమల్‌రావు, పలువురు నాయకులు అభ్యర్థులు పాల్గొన్నారు.