Peddapalli: రికార్డు స్థాయిలో ప్రసవాలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:18 PM
పెద్దపల్లిటౌన్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పెద్దపెల్లి జిలా ్లకేంద్రంలోని ఎం.సి.హెచ్ ఆసుపత్రిలో సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో 250ప్రసవాలు జరిగాయని, దీనికి కృషిచేసిన అధికారు లను ప్రత్యేకంగా జిల్లాకలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లిటౌన్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పెద్దపెల్లి జిలా ్లకేంద్రంలోని ఎం.సి.హెచ్ ఆసుపత్రిలో సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో 250ప్రసవాలు జరిగాయని, దీనికి కృషిచేసిన అధికారు లను ప్రత్యేకంగా జిల్లాకలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. గతంలో ఎన్నడు సాధించని విధంగా సెప్టెంబర్ నెల జిల్లాలోని అన్నిప్రభుత్వ ఆసుపత్రులలో కలుపుకొని 503ప్రసూతులు నిర్వహించారని కలెక్టర్ తెలిపారు. గత నెలలో కేవలం 130వరకు మాత్రమే డెలివరీలు అయ్యేవని ఒక్క సెప్టెంబరు నెలలో ఇంత పెద్దమొత్తంలో డెలివరీలు కావడంపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత డాక్టర్లను, సిబ్బందిని క్షేత్రస్థాయి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.