Peddapalli: రామగుండం నగరాభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదినక పూర్తిచేయండి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:30 AM
కోల్‌సిటీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రామ గుండం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయా లని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కా న్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అధికారు లకు సూచించారు.
పనులను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
కోల్‌సిటీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రామ గుండం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయా లని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కా న్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అధికారు లకు సూచించారు. బుధవారం సమ్మక్క-సార లమ్మ జాతర ప్రదేశంలో అభివృద్ధి పనులు, గోదావరివద్ద శ్మశానవాటిక నిర్మాణపనులు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణపనులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.3కోట్లతో నూత నంగా నిర్మించనున్న కళాశాల, డిగ్రీకళాశాల వద్ద ఫుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదలను, మున్సిపల్‌జంక్షన్ వద్దఉన్న అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్షసమావేశాన్ని నిర్వహించి అధికారులకు పలుసూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.28.08కోట్ల డీఎంఎఫ్‌టీ నిధుల ద్వారా నగరంలో 181 అభివృద్ధి పనులు మంజూరు చేయడం జరిగిందని, వీటికి సంబం ధించిన టెండర్లప్రక్రియ త్వరగా చేపట్టి పను లను మొదలయ్యే విధంగా చర్యలుతీసుకోవాల ని అధికారులకు సూచించారు. రామగుండం నియోజకవర్గంలో ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా రూ.8.55కోట్లతో 31అభివృద్ధి పనులను మంజూరు చేస్తామని, వీటిలో చాలావరకు నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయన్నారు. అభివృద్ధి పనులకు నిధుల ఆటంకం లేనందున పనులు ఎక్కడఆలస్యం కాకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌వెంట ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్, నగరపాలకసంస్థ కమిషనర్ అరుశ్రీ, ఈఈ రామన్, నాయకులు మహంకాళి స్వామి, దీటి బాలరాజు, యుగంధర్, పెండ్యాల మహేష్,దాసరి విజయ్, ముస్తాఫా ఉన్నారు.