Share News

Peddapalli: అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:48 PM

సుల్తానాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు

Peddapalli: అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి

- సుల్తానాబాద్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష విస్తృత పర్యటన

సుల్తానాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధిం చిన ప్రతిపాదనలు త్వరగా తయారు చేసి తనకు సమర్పించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను అదేశించారు. పాత ప్రహరీ, భవనాలను కూల్చివేసే పనులను కూడా తొందరగా పూర్తి చేయాలన్నారు. శుక్రవారంకలెక్టర్‌ సుల్తానాబాద్‌ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఐబీ చౌరస్తా వద్ద జరుగుతున్న రోడ్డువిస్తరణ పనులను పరిశీలిం చారు. అభివృద్ది పనులకు ఆటంకంగా ఉన్న కాంపౌండ్‌ వాల్స్‌ కూల్చివేత పనులు త్వరగా పూర్తి చేయాల న్నారు. ఐబీని ఆనుకుని ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వసతిగృహాన్ని పూర్తిగా పరిశీ లిస్తూ అక్కడ అందిస్తున్న వసతిసౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ అస్పత్రి వద్ద నిర్మాణంలో ఉన్న ప్రహరీని త్వరగా నిర్మించాలన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఉన్న ప్రభుత్వహైస్కూల్‌ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. స్థానిక మున్సి పాలిటీ కార్యాలయంలో అధి కారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రజలు ఎదురుకుంటున్న సమస్యల గురించి తెలుసుకు న్నారు. మంచినీటి పథకం సరఫరా ఎలా జరగుతుంది, నూతన ట్యాంకు నిర్మాణ పనుల గురించి ఆరా తీశారు. సుల్తానాబాద్‌ పట్టణ అభి వృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను తయారు చేయాలని వాటిని తమకు పంచించాలని సూచిం చారు. పట్టణ ప్రధానచౌరస్తా నుంచి గట్టేపల్లివరకు విద్యుత్‌ స్థంభాలను, ట్రాన్స్‌ ఫార్మర్‌ల షిఫ్టింగ్‌ పనులను ఈ నెల16లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వఆస్పత్రి వద్ద డ్రైనేజీనిర్మాణం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్‌ పర్యటనలో ఆయనవెంట మున్సిపల్‌ కమీషనర్‌ టి రమేష్‌, ఆర్‌అండ్‌బీ డీఈ రవికిరణ్‌, ఏఈ గుణశేఖర్‌ రెడ్డి, ఏలక్ట్రికల్‌ ఏఈ కిషోర్‌, మున్సిపల్‌ ఏఈ రాజ్‌కుమార్‌, మేనేజర్‌ అలీమొద్దిన్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:48 PM