Share News

Peddapalli: బస్సుల కోసం ప్రయాణికుల పరుగులు

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:21 PM

కళ్యాణ్‌నగర్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు బస్సులు లేక వచ్చిన బస్సుల కోసం పరుగులు తీశారు.

Peddapalli:  బస్సుల కోసం ప్రయాణికుల పరుగులు

కళ్యాణ్‌నగర్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు బస్సులు లేక వచ్చిన బస్సుల కోసం పరుగులు తీశారు. మంగళవారం గోదావరిఖని బస్టాండ్‌ ప్రయాణికులతో కిటకిటలాడింది. మూడురోజులుగా హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌వంటి నగ రాల నుంచి సొంతగ్రామాలకు వచ్చే ప్రయాణి కుల కోసం ఆర్టీసీ ప్రత్యేకబస్సులు నడిపించ డంతో గ్రామాలకు వెళ్లే వివిధ రూట్లలో బస్సుల సంఖ్య తగ్గించడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూపాలపల్లి, మంచి ర్యాల, బెల్లంపల్లి, ఆసిఫా బాద్‌, కాగజ్‌నగర్‌, బేగంపేట, ఓడెడ్‌, ధర్మారం, జగిత్యాల, రచ్చపల్లి, కూనారం, జమ్మికుంట వెళ్లేందుకు బస్సులు లేక ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. భూపా లపల్లి రూట్‌లలో నడిచే సర్వీసులను తగ్గిం చారు.సిటీలోని డిలాక్స్‌, మెట్రో బస్సులను కరీం నగర్‌, గోదావరిఖని, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ ఏరియాలకు బస్సులను నడిపారు. ప్రస్తుతం పండుగ స్పెషల్‌పేరుతో ప్రయాణీకులపై అద నంగా 50శాతం చార్జిలనువసూలు చేస్తున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 11:21 PM