Peddapalli: పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌హౌస్
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:07 AM
పెద్దపల్లి టౌన్/ఓదెల/యైుటింక్ల యిన్‌కాలనీ, అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి): పోలీస్ అమరవీరుల వారో త్సవాల్లో భాగంగా బుఽధవారం పెద్దపల్లి, ఓదెల మండలం పొత్క పల్లి, గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లలో పోలీసులు విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు.
పెద్దపల్లి టౌన్/ఓదెల/యైుటింక్ల యిన్‌కాలనీ, అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి): పోలీస్ అమరవీరుల వారో త్సవాల్లో భాగంగా బుఽధవారం పెద్దపల్లి, ఓదెల మండలం పొత్క పల్లి, గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లలో పోలీసులు విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రైవేట్‌పాఠ శాలలకు చెందిన విద్యార్థులకు రిసె ప్షన్, స్టేషన్‌హౌస్ ఆఫీసర్, లాకప్, కోర్టు రూం, కంప్యూటర్ రూం, క్రెమ్ ఫైల్స్, పోలీసుల విధులు, అధికారాలు, తదితర అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే వారి సందేహా లను కూడా తీర్చారు.
కాలనీలో ఫ్లాగ్ డే..
యైుటింక్లయిన్‌కాలనీ: పోలీసు ఫ్లాగ్‌డే కార్యక్రమంలో భాగంగా బుధవారం పోలీస్ కళాబృందం యైుటింక్లయిన్ కాలనీ షిర్కేచౌరస్తాలో ప్రత్యేకకార్యక్రమాన్ని నిర్వహించిం ది. పోలీస్ అమరులకు సిబ్బందితోపాటు స్థానిక వ్యాపారులు, ఆటోడ్రైవర్లు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కళాబృందాలు పాటల ద్వారా పోలీసుల త్యాగాలను గుర్తుచేస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. మద్యపానం, మత్తుపదార్థాల వాడకంతో అనర్థాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించడంవంటి అంశాలపై కళాబృందాలు ప్రజలకు అవగాహన కల్పించాయి. కార్యక్రమంలో ఎస్‌ఐ అహ్మదుల్లాతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.