Peddapalli: ఎన్‌ఎస్‌జీ4 గ్రేడ్‌స్టేషన్‌గా ఓదెల రైల్వే స్టేషన్
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:47 AM
ఓదెల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఓదెల రైల్వేస్టేషన్ అభివృద్ధికి, పలు రైళ్లు హాల్టింగ్‌కు రైల్వే ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు.
ఓదెల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఓదెల రైల్వేస్టేషన్ అభివృద్ధికి, పలు రైళ్లు హాల్టింగ్‌కు రైల్వే ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా హాల్ట్ గ్రేడ్ హెచ్‌జి1 స్థాయిలో ఉన్న ఓదెల రైల్వేస్టేషన్‌ను ఎన్‌ఎస్‌జి4గ్రేడ్ స్థాయిగా ఉన్నతీకరిం చారు. ఈమేరకు జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్‌ఎస్ 4 గ్రేడ్ స్టేషన్ కాగా, కరీంనగర్, జమ్మికుంట రైల్వేస్టేషన్లు ఎన్‌ఎస్‌జి5 గ్రేడ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం రైల్వే ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో ఓదెల రైల్వేస్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు హాల్టింగ్ చేసేందుకు అవకాశాలు లభించాయి. అలాగే రైల్వేస్టేషన్లో అనౌన్స్‌మెంట్, కంప్యూటరీకరణ, మౌలిక సౌకర్యాల ఏర్పాట్లు, పూర్తిస్థాయిలో కల్పించేందుకు రైల్వేబోర్డు ప్రణాళికలు రూపొందించనుంది. సికింద్రా బాద్ డివిజన్‌ను మహారాష్ట్ర, కర్ణాటకలోని రాయచూరు, బళ్లారి 150 కిలోమీటర్ల వరకు విస్తరించారు. అలాగే సౌత్‌కోస్ట్ రైల్వే ఎస్‌సీవోఆర్ కొత్తజోన్ ఏర్పాటుతో ఈ మార్పులు వచ్చాయి. వైజాగ్, వాల్తే రును జోన్లుగా, డివిజన్లుగా ఏర్పాటు చేయడంతో, ఎస్‌సీఆర్‌లో పెద్దమార్పులు, చేర్పులు వచ్చాయి. దీంతో రూ.60లక్షల నుంచి పైగా ఆదాయాలున్న రైల్వేస్టేష న్లను ఎన్‌ఎస్‌జి4 గ్రేడ్‌గా ఉన్నతీకరిస్తూ రైల్వేబోర్డు అమలు చేస్తున్నారు. పెద్ద డివిజన్‌గా ఉన్న సికింద్రాబాద్‌కు ఇప్పుడు అదనంగా రాయచూరు, విష్ణుపురి మార్గాలు వచ్చాయి. దక్షిణ ఉత్తర భారతదేశాన్ని కలిపే కాజీపేట్‌కు కోచ్ ఫ్యాక్టరీ రావడంతో డివిజన్‌గా అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. భారత రైల్వే బోర్డులో 2019లో ఎస్‌సీవోఆర్ అనే కొత్త జోన్ ప్రకటించడంతో, ఈ విధంగా విస్తరణ, చేర్పులు, మార్పులు జరిగాయి.