Peddapalli: రైతులకు అందుబాటులో నానో యూరియా
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:06 AM
పాలకుర్తి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రైతులు యూరియా కంటే ద్రవరూపంలో ఉన్న నానోయూరియా వాడడం ఉత్తమమని మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పాలకుర్తి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రైతులు యూరియా కంటే ద్రవరూపంలో ఉన్న నానోయూరియా వాడడం ఉత్తమమని మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నానో కంపెనీ వాళ్లతో మాట్లాడి అరలీటర్ బాటల్ మార్కెట్ ధర 225ఉండగా 75రూపాయలు తగ్గించి రైతులకు 150కే ఇప్పించేందకు ఏర్పాటు చేశారని ఈ అవకాశాన్ని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎలిగేడు: రైతులకు అందుబాటులో నానోయూరియాప్లస్ ఉందని మండల వ్యవసాయ అధికారి ఉమాపతి తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని సింగిల్ విండో గోదాంలో రైతులకు నానో యూరియా ప్లస్‌పై అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నానోయూరియా ప్లస్‌ను జిల్లా కలెక్టర్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి రూ.250ధరకు ఉండగా, రైతులకు రూ.150కే అందుబాటులో ఉండేలా తీసుకువచ్చారని తెలిపారు. ఒక ఎకరానికి బాటిల్‌నర పురుగుల మందుతో కలిపి పిచికారి చేస్తే 20 రోజుల వరకు మొక్కలకు నత్రజని అందుతుందన్నారు.