Peddapalli: మొంథా ముంచేసింది..
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:10 AM
పెద్దపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురిసిన అకాలవర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పంట చేతికి అందే సమయంలో కురిసిన వర్షాలతో రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది.
- జిల్లాలో 8వేల ఎకరాల్లో వరి,
- 2 వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం
- ఆదుకోవాలని కోరుతున్న రైతులు
పెద్దపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురిసిన అకాలవర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పంట చేతికి అందే సమయంలో కురిసిన వర్షాలతో రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయంనుంచి గురువారం రాత్రి వరకు కుండపోతగా వర్షం కురియడంతో ఆయామండలాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. చాలాగ్రామాల్లో ఈదురుగాలులు, భారీ వర్షానికి కోతకు వచ్చిన వరి నీట మునిగింది. పత్తి తడిసిపోగా, దూది నల్లగా మారుతున్నదని రైతులు తెలిపారు. ఓదెల, కాల్వశ్రీ రాంపూర్, ముత్తారం, మంథని, సుల్తానాబాద్ మండలాల్లో ఎక్కువగా పంటనష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 80ఎక రాల్లో వరిపంట, 2వేల ఎకరాల్లో పత్తిపంటకు నష్టం వాటిల్లిందని రైతులుతెలిపారు. 53క్వింటాళ్ల వరి ధాన్యం పలు మార్కెట్‌యా ర్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి కొట్టుకు పోయాయి. కానీ వ్యవసా యశాఖ అధికారులు మాత్రం సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో 271ఎకరాల వరిపంటకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉద యం వరకు జిల్లావ్యాప్త్తంగా 82.3మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోద యింది. అత్యధికంగా ఓదెల మండలంలో 150.8మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే కాల్వశ్రీరాంపూర్ మండ లంలో 122.6, ముత్తా రం మండలంలో 120.4, సుల్తానాబాద్ మండ లంలో 96.5, ఎలిగేడు మండలంలో 87.2 మంథని మండలంలో 83.6, పెద్దపల్లి మండలంలో 82.2 రామగిరి మండలం 80.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కమాన్‌పూర్ మండలంలో 75.4, ధర్మారం మండలంలో 53.6, అంతర్గాం మండలంలో 51.6,రామగుండం మండలంలో 46.6, పాలకుర్తి మండలంలో 45.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పంటనష్టపోయిన రైతులు తమకు పరిహారంఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతు న్నారు.
అన్నదాత ‘వరి’గోస..
పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి మండలంలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్‌తో కొన్ని గ్రామాల్లోని వరిపంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. నిట్టూరు, నిమ్మనపల్లి, పెద్దకల్వల తదితర గ్రామాల్లో వరిపంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మండల వ్యాప్తంగా 120ఎకరాల్లో వరిపంట నష్టం జరిగిందని వ్యవసాయాధికారులు అంచనా వేసినట్లు ఏవో అలివేణి తెలిపారు. కొత్తపల్లి రైల్వే అండర్‌బ్రిడ్జి కింద వరదనీరు చేర డంతో ఉదయం ఇరువైపులా రాకపోకలు నిలిచిపో యాయి. అధికారులు నీటిని మోటార్‌ల ద్వారా తొల గించడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.
ఫ రైతులను ఆదుకోవాలి..
పెద్దపల్లి నియోజకవర్గ రైతులను ఆదుకోవాల్సిన అవ సరం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావుకు ఉందని తెలంగాణ రాజ్యాధికారపార్టీ జిల్లానాయకుడు గుండవేణ స్వామి అన్నారు. మండలంలోని పెద్దకల్వలలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిచిన ధాన్యాన్ని ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ వెంటనే నష్టపోయిన పంటకు ఎకరానికి రూ.50వేల పరిహరం అందించాలని డిమాండ్ చేశారు.
సుల్తానాబాద్: ఎడతెరపిలేకుండా కురిసిన వర్షానికి, ఈదురుగాలులకు కోతకు వచ్చిన వరిపంటలు దెబ్బతిని రైతాంగం తల్లడిల్లుతున్నది. కోతకు సిద్ధంగా ఉన్న పొలాలు నేలపాలయ్యాయి. విక్రయం కోసం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. తేమ శాతం రావడానికి ఎన్ని దినాలు పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 260ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు తేలింది.
కాల్వశ్రీరాంపూర్: మండలకేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పలువురు రైతుల ధాన్యం కొట్టుకుపోయింది. మండలంలోని కాల్వశ్రీరాంపూర్, వెన్నంపల్లి, ఈదులాపూర్, కిష్టం పేట తదితరగ్రామాల్లో వరిపంట నీటమునిగింది. పూతకువచ్చిన పత్తి రాలిపోయింది. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకో వాలనిరైతులువిజ్ఞప్తి చేస్తున్నారు.
జూలపల్లి: మండలంలో సాగుచేసిన పత్తిపంటసైతం చేతికి వచ్చేదశలో దెబ్బతి న్నాయని రైతులు వాపోతున్నారు. మండలంలోని నాగు లపల్లి, చీమలపేట ఆయాగ్రామాల్లో ధాన్యం తడిసి పోవడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు.
ధర్మారం: మండలంలోని మల్లాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిముద్దయింది. గురువారం ఆయాగ్రామాల్లో నేలవాలిన పంటపొలాలను వ్యవ సాయ అధికారి భాస్కర్ పరిశీలించారు. పొలంలో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపాలని, కిందపడిన వరిని కట్టలుగా కట్టి మడిలో గాలి ఆడే విధంగా చూసుకోవా లన్నారు.
మంథని: మంథని డివిజన్‌లోని పలుమండలాల్లో వరి, పత్తిపంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పొట్ట, కోత దశలోఉన్న వరి, కాతదశలో ఉన్న పత్తిపంటలు వర్షంతో దెబ్బతిన్నాయి. స్థానిక మార్కెట్‌యార్డులో కొనుగోలు కోసం ఆరబోసుకున్న వేలాది క్వింటాళ్ల ధాన్యం పూర్తిగా వర్షంనీటిలో తడిచి ముద్దగా మారింది. వరి కుప్పల చుట్టూ వర్షం నీరు చేరడంతో చెరువును తలపించింది.
మంథనిరూరల్: మండలంలో పలు గ్రామాల్లో పొలాల్లోకి వరదనీరు చేరడంతో పంటలకు పెద్దఎత్తున నష్టం వాట్లింది. సుందిళ్ల బ్యారేజీకి ఎవుగువ ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు 23గేట్లు ఎత్తడంతో దిగువ ఉన్న సుందిళ్ల బ్యారేజీలోకి 2లక్షల క్యూసెక్‌ల నీరు వచ్చి చేరుతుండటంతో బ్యారేజీ 74గేట్లు ఎత్తి ఉండ టంతో వరద దిగువ ప్రాంతానికి విడుదలవుతోంది.
ముత్తారం: భారీవర్షాలు కురవడం, మానేరు ఉధృ తిగా ప్రవహిస్తుండటంతో మండలంలో పంటపొలాలు నీటమునిగి రైతులకు కన్నీటిని తెప్పించాయి. మానేరు ఉగ్రరూపం దాల్చడంతో పరివాహకప్రాంతాలైన ముత్తా రం, ఖమ్మంపల్లి, అడవిశ్రీరాంపూర్, ఓడేడు గ్రామాల్లో సుమారు వంద ఎకరాల్లో పంటనీట మునిగింది. రైతుల మోటార్లు, బోర్లు, పైపులైన్లు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటలను గుర్తించి ఆదుకోవాలని కోరుతున్నారు.