Share News

Peddapalli: భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టడానికి మోదీ కృషి: ఎమ్మెల్సీ కొమురయ్య

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:02 AM

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని టీచర్స్‌ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు.

Peddapalli: భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టడానికి మోదీ కృషి:  ఎమ్మెల్సీ కొమురయ్య

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని టీచర్స్‌ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. వికసిత్‌ భారత్‌లో భాగంగా సుల్తానాబాద్‌లో గురువారం నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ మోదీ వికసిత్‌ భారత్‌ కార్యక్రమం ద్వారా 2047నాటికి, మన దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో ప్రపంచ ఆర్థికవ్యవస్థలో దేశం నాలుగోస్థానంలో నిలిచిందన్నారు. కార్యక్ర మంలో పాఠశాలచైర్మన్‌ మాటేటి సంజీవ్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ కృష్ణప్రియ, బీజేపీజిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, ప్రధానకార్యదర్శి కడారి అశోక్‌ రావు, జిల్లాసేవా పక్వాడ అభియాన్‌ కన్వీనర్‌ నల్ల మనోహర్‌రెడ్డి, కోకన్వీ నర్‌ మిట్టపల్లి ప్రవీణ్‌కుమార్‌, మహిళా మోర్చా కన్వీనర్‌ నిర్మల, జిల్లా ఉపాధ్యక్షుడు చౌదరి మహేందర్‌, రమేష్‌, జిల్లా కోశాధికారి రాజేంద్రప్ర సాద్‌, నాయకులు కొమ్ము తిరుపతి, చాతరాజు రమేష్‌, పవన్‌, సతీష్‌, శ్రీనివాస్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 12:02 AM