Share News

Peddapalli: మినీ స్టేడియం స్థలాన్ని పరిశీలించిన మంత్రి

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:39 AM

ధర్మారం, సెప్టెంబరు 14 (ఆంధ్ర జ్యోతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించతలపెట్టిన మినీ స్టేడి యం స్థలాన్ని ఎస్‌సి, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పరిశీలిం చారు.

 Peddapalli:  మినీ స్టేడియం స్థలాన్ని పరిశీలించిన మంత్రి

ధర్మారం, సెప్టెంబరు 14 (ఆంధ్ర జ్యోతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించతలపెట్టిన మినీ స్టేడి యం స్థలాన్ని ఎస్‌సి, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పరిశీలిం చారు. మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట సర్వేనంబర్‌ 476లో మినీ స్టేడియం కోసమని ఇప్పటికే స్థలం కేటా యించినా, కొన్నిసంవత్సరాలుగా స్టేడి యం నిర్మాణానికి అడుగులు పడలేదు. ఆదివారం స్థానిక నాయకులతోకలిసి ఆ స్థలాన్ని పరిశీలించిన మంత్రి అడ్లూరి పూర్తివివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ స్థలమంతా బండరాళ్లతో నిండి ఉండడంతో తదుపరి చర్యల కోసం మైనింగ్‌ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వస్థలాన్ని చదును చేసి మినీ స్టేడియంతో పాటు, వాకింగ్‌ ట్రాక్‌, నిర్మిస్తామని, మిగిలిన స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అందుబాటులోకి తెస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆయనతోపాటు ఏఎంసీ చైర్మన్‌ లావుడ్య రూప్లానాయక్‌, వైస్‌ చైర్మన్‌ అరిగె లింగయ్య, కాడె సూర్యనారాయణ, సోగాల తిరుపతి, ఓరెం చిరంజీవి, పొన్నవేని స్వామి, దేవి అఖిల్‌, పాలకుర్తి సాయి, కాంసాని ఎల్లయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 12:39 AM