Peddapalli: ఆలయ అభివృద్ధికి నెలలో మాస్టర్ ప్లాన్: ఎమ్మెల్యే విజయరమణారావు
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:38 AM
ఓదెల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : నెలరోజుల్లో భ్రమరాంబ ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.
ఓదెల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : నెలరోజుల్లో భ్రమరాంబ ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఏసీ సుప్రియ, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఈవోలు పూర్ణకుంభంతో కలెక్టర్, ఎమ్మెల్యేని ఘనంగా స్వాగతించారు. స్వామివారి దర్శనం అనంతరం చైర్మన్ చీకట్ల మొండయ్య, అధికారులు, అర్చకులు సన్మానించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అలాగే ఆలయ అభివృద్ధిపై కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు కలిసి ఆలయ పరిసరాల మ్యాపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డిని సంప్రదించి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. ఒగ్గు పూజారులకు టికెట్‌పై వాటా ఇంతకు ముందున్న 25శాతాన్ని 35శాతానికి పెంచి జీవోపత్రాలను కూడా అందజేశామని అన్నారు. కార్యక్రమంలో ఏసీ సుప్రియ, ఆలయచైర్మన్ చీకట్ల మొండయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఈవోలు సదయ్య, ముద్దసాని శంకర్, ధర్మకర్తలు, నాయకులు, మాజీసర్పంచులు దాసరి రాజన్న, ఆకుల మహేందర్, బోడకుంట స్వామి, బొంగోని రాజయ్య, పడాల రాజు, అలాగే నాయకులు విజయేందర్ రెడ్డి, బైరి రవి గౌడ్, రెడ్డి రజినీకాంత్, కసిరెడ్డి మహేందర్ రెడ్డి, ఉడిగే సాదయ్య, ఎండి రఫీ పాల్గొన్నారు.
ఫ యూరియా పంపిణీ కేంద్రం
ప్రారంభించిన ఎమ్మెల్యే
ఓదెల మండలంలోని కొలనూర్‌లో బుధవారం సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినీయూరియా పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతకుంటవిజయరమణరావు ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్‌సాగర్ రెడ్డి, చైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్‌నాయకులు ఎడవెల్లి విజయ పాల్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ గోపునారాయణరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి భైరీ రవిగౌడ్, మాజీ సర్పంచ్ సామ శంకర్, గుండేటి ఐలయ్య పాల్గొన్నారు.