Peddapalli: అమరుల బాటలో నడుద్దాం..
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:52 PM
గోదావరిఖని, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): భూమి కోసం, భుక్తికోసం, ఈ దేశవిముక్తి కోసం ఆయుధాన్ని చేతపట్టి అమరులైన వారిబాటలో నడుద్దామని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే రాజన్న అన్నారు.
సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజన్న
గోదావరిఖని, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): భూమి కోసం, భుక్తికోసం, ఈ దేశవిముక్తి కోసం ఆయుధాన్ని చేతపట్టి అమరులైన వారిబాటలో నడుద్దామని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే రాజన్న అన్నారు. ఆదివారం ఆపార్టీ జిల్లాకమిటీ ఆధ్వ ర్యంలో గోదావరిఖని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణసభ నిర్వహించారు. విప్లవో ద్యమంలో అమరులైన వీరులకు మౌనం పాటించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ నేడుదేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తూ ఫాసిస్టు పాలనను చేస్తోందన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెడుతోంద న్నారు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాల పాలనకు వ్యతిరేకంగా అమరులు అందించిన పోరాటస్ఫూర్తితో, వారి ఆశయ సిద్దికై, బలమైన విప్లవోద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందని అందుకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షత జరిగిన ఈ సంస్మరణ సభలో నాయకులు ఐ కృష్ణ, ఏ వెంకన్న, బీ అశోక్, చిలుక శంకర్, కే జ్యోతి, ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.