Share News

Peddapalli: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుదాం

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:40 AM

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్ర జ్యోతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుదామని ఆపార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి కడారి అశోక్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 Peddapalli: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుదాం

- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్‌రావు

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్ర జ్యోతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుదామని ఆపార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి కడారి అశోక్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానికంగా ఒక ప్రైవేట్‌ కశ్యాణమండపంలో ఆదివారం జరిగిన బీజేపీ ముఖ్యకార్యకర్తలు, నాయకుల సమావేశం జరిగింది. ఈసమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానా ల్లో పోటీ చేస్తుందని, విజయం సాధించే దిశగా తగిన కార్యచరణ రూపొం దించుకుంటున్నామని అన్నారు. ఎన్నికలను ఎదురుకోవడానికి కార్యకర్తలు నాయకులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. బీజేపీ సేవా పక్వాడా కార్యక్రమ జిల్లాకోకన్వీనర్‌ మిట్టపల్లి ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతు ప్రధానిమోదీ జన్మదినం సంద ర్భంగా జిల్లావ్యాప్తంగా పలు సేవాకార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. రక్తదాన శిబిరాలు మొక్కలు నాటడం, జాతీయనేతల చిత్రపటాలకు పుష్పాంజలి నిర్వహిస్తామన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కూకట్ల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో ఏగోలపు సదయ్య, చిట్టవేని సదయ్య, సాయికిరణ్‌, లంక శంకర్‌, వేగోళపు శ్రీనివాస్‌గౌడ్‌, ఎల్లంకి రాజన్న, ఎనగందుల సతీష్‌, గజబీంకార్‌ పవన్‌,బూసారపు సంపత్‌, తిరుపతి, కందునూరి తిరుపతి, శ్రీగిరి సుధాకర్‌, గుడ్ల వెంకటేశ్‌, రామిడి రవీందర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 12:40 AM