peddapalli : భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పర్వదినం
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:48 AM
సుల్తానాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలు భక్తు లతో కిటకిటలాడాయి. శివాలయాలు శివనామాలతో మార్మోగిపోయాయి.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
సుల్తానాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలు భక్తు లతో కిటకిటలాడాయి. శివాలయాలు శివనామాలతో మార్మోగిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆల యాలకు వచ్చి దీపాలు వెలిగించి స్వామికి అభిషేకం చేసి దీపా సాలగ్రామ గోదానాలను నిర్వహించారు. అనంతరం కార్తీకపురాణం శ్రవణం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాతబజార్‌లోని శివాలయంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. స్థానికవేణుగోపాలస్వామి ఆలయంలో సాల గ్రామదాన పూజలు నిర్వహించారు. సాంబశివ దేవాలయంలో ముఖద్వారంలో జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి పల్లకిసేవ నిర్వహించారు. వేణుగోపాల స్వామి, సాంబశివ దేవాలయాల్లో పల్లా సుమ మహేందర్ దంపతుల ఆధ్వర్యంలో 20వేల దీపాలను భక్తులు వెలిగిం చారు. పాతబజారులోని శివాలయంలో మెంగని చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో కార్తీకదీ పోత్సవాలు నిర్వహించారు. ఐతరాజ్‌పల్లిలోని సీతారాముల ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు.
ఎలిగేడు/కాల్వశ్రీరాంపూర్/రామగిరి: ఎలిగేడు మండలంలోని ర్యాకల్‌దేవుపల్లి- రాములపల్లి గ్రామాల్లోని నాగలింగేశ్వరస్వామి ఆలయంలో, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం సామూహిక సత్యనారాయణవ్రతాలను నిర్వహించారు. స్వామివారికి కన్నుల పండవగా దీపారాధన చేశారు. దీపాలు వెలిగించి ఇండ్ల ముందు ఉంచారు. పిల్లలు, పెద్దలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీపాల వెలుగులతో ప్రతిపల్లెనిండా ఉత్తేజం నిండింది. రామగిరి మండలం సెంటినరీకాలనీ శ్రీకోదండరామాలయంలోని ఉసిరివనంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు.
ఓదెల: మండలంలోని భ్రమ రాంబ మల్లికార్జునస్వామి క్షేత్రంతో పాటు పొత్కపల్లి రాజగోపాలస్వామి, శివాలయంతోపాటు మడక వేణు గోపాలస్వామి, గుంపుల రామ భద్రాలయాల్లో కార్తీకపౌర్ణమి వేడుక లను వైభవంగా నిర్వహించారు.
కమాన్‌పూర్: మండల కేంద్రం లోని ఆదివరాహస్వామి ఆలయం, శివాలయం, వేణుగోపాలస్వామి ఆల యాల్లో భక్తులు దీపాలు వెలిగిం చారు. ఆదివరాహస్వామి వారిని దర్శించుకున్న పలువురు భక్తులు ఉసిరికచెట్టు ముందు కొబ్బరి, ఉసిరికాయ దీపాలను వెలిగించారు. తమ కోర్కెలు నెరవేర్చాలని ఆ వరాహమూర్తిని వేడుకున్నారు. శివాల యాల్లో దేవదేవునికి భక్తుల అభిషేకాలు, పంచామృతాలతో సందడిగా మారింది. శివునికి ఇష్టమైన బిల్వపత్రం, ఉసిరి కాయ, ఉసిరి ఆకుతో ప్రత్యేక పూజలు చేశారు.
జూలపల్లి: మండలకేంద్రలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంతోపాటు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారలకు ప్రత్యేకపూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బీజేపీ నాయకుడు నల్ల మనోహ ర్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టి నాయకులు మెతుకు కాంతయ్య కుటుంబ సభ్యులు,పలువురు ప్రత్యేకపూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. మెతుకు కాంతయ్య భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ పొట్యాల మల్లేశం, నాయకులు సిరి కొండ కొమురయ్య, రాగల్ల రవి, మేర శ్రీనివాస్ పలువురు పల్గొన్నారు.
మంథని/మంథనిరూరల్: శివ-కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకపౌర్ణమిని బుధవారం ప్రజలంతా వైభవంగా జరుపుకున్నారు. మంథని శివారులోని పవిత్ర గోదావరినదిలో తెల్లవారు జాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వేదపండితులతో సంకల్పం చెప్పించుకొని వారికి ఉసిరికాయతో పాటు దీపాలు, ఇతర వస్తువులు దానంగా సమర్పించారు. అనంతరం నదీ తీరంలో గోదావరిమాతకు, సైకతలింగాలతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో, ఉసిరిక చెట్టు, ఇంటివద్ద తులసికోటకు పూజలు నిర్వహించారు. గోదావరినది తీరంలోని శ్రీగౌతమేశర్వాలయంలో రాత్రి శ్రీగౌతమేశ్వరస్వామి-పార్వతీ అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గోదావరి మాతకు రాత్రి మహాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇంట్లో, ఆలయాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు దీపాలు వెలి గించారు. ఆలయాల్లో జ్వాల తోరణాన్ని వెలిగించారు.
వైభవంగా లక్ష బిల్వార్చన
పాలకుర్తి: ఓం నమశ్వివాయ.. హరహర శంభోశంకర మహదేవా.. శివోహం అంటూ భక్తుల నామస్మరణతో కుక్కలగూడూర్ శివాలయం ప్రాంగాణం పరిసర ప్రాంతాలు మారుమోగాయి. బుధవారం కార్తీక ఫౌర్ణమిని పురస్కరించుకొని వందలాది భక్తుల సమక్షంలో ఈశ్వరునికి మారేడుదళాలతో లక్ష బిల్వార్చన నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తమ మారేడు దళాలతోపాటు కొబ్బరికాయలు కొట్టి తమతమ కోర్కెలు నెరవేరాలని పరమశివున్ని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.
ఖనిలో జ్వాలాతోరణం..
కోల్‌సిటీటౌన్: కార్తీక పౌర్ణమి పర్వదిన వేడుకలు బుధవారం గోదావరిఖనిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గోదావరి స్నానాలు ఆచరించి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున కోదండరామాలయం, శివాలయాల్లో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం కోదండరామాలయం, శివాలయాల్లో వేలాదిమంది భక్తులు దేవతమూర్తులను దర్శించుకొని ఆలయంలో దీపాలు వెలిగించి అర్చకులకు దీపదానాలు చేశారు. ఆలయకమిటీ, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి. కోదండ రామాలయం శివాలయంలో కార్తీకపౌర్ణమి సంద ర్భంగా బుధవారం సాయంత్రం జ్వాలాతోరణ ఉత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ కమిటీచైర్మన్ గట్ల రమేష్, అర్చకులు అత్తెణ చంద్రశేఖరశర్మ జ్వాలా తోరణాన్ని వెలిగించారు. శివాలయం ప్రాంగణం శివ నామస్మరణతో మార్మోగింది. అధిక సంఖ్యలో భక్తులు జ్వాలాతోరణంలో నుంచి శివాలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయక్లర్క్ సుధాకర్, కమిటీ సభ్యులు దశరథం, పంజ శ్రీనివాస్, స్వరాజ్ కృష్ణ, శ్రీకాంత్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.