Peddapalli: దళిత బహుజనులకు స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు ఫూలే
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:32 AM
కోల్‌సిటీటౌన్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): దళిత బహుజనుల, అణగారినవర్గాల స్ఫూర్తిప్రదాత మహా త్మాజ్యోతిరావుఫూలే అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్, పులిమోహన్ అన్నారు.
కోల్‌సిటీటౌన్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): దళిత బహుజనుల, అణగారినవర్గాల స్ఫూర్తిప్రదాత మహా త్మాజ్యోతిరావుఫూలే అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్, పులిమోహన్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని రాజే ష్ థియేటర్ సమీపంలో ఉన్న జ్యోతిరావుఫూలే విగ్ర హానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ఫూలేను ఆదర్శంగా తీసుకొని నేటితరం ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బొం కూరి మధు, గొర్రె నర్సింగరావు, యాసర్ల చిరంజీవి, పెరుక రవి, ఎంఏ కరీం, శనిగరం చంద్రశేఖర్, జిలకర రామస్వామి, బొంకూరి పవన్, మురళి, మంతెన సంపత్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు గట్లరమేష్ ఆధ్వర్యంలో సైతం వర్ధంతికార్యక్రమం నిర్వహించారు. ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
రామగిరి: మండలంలోని సెంటినరీకాలనీ మార్కె ట్‌చౌరస్తాలో మహాత్మాజ్యోతిరావుఫూలే వర్ధంతి శుక్ర వారం బీసీనేతలు జరుపుకున్నారు. సెంటినరీకాలనీ టిటూ సెంటర్‌లో ఫూలేవిగ్రహనికి దండలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు నూనె రాజేశం, చిట్టిమల్లయ్య, చెలుకల జవహర్, రామచం దర్, లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఎలిగేడు: మహాత్మా జ్యోతిబాఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. శుక్రవారం మండలంలోని శివపల్లి, ఎలిగేడులో ఫూలే వర్ధంతిలో పలువురు నాయకులు, ప్రజలు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గోపురమేష్, భాస్కర్‌రెడ్డి, నాయకులు దుగ్యాల సంతో ష్‌రావు, కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, మండిగ రాజ నర్సు, అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు, తాటిపల్లి రమేష్ బాబు, బాలసాని పర్శరాములు గౌడ్, అమ్ముల రమేష్, రంగు శ్రీనివాస్, పడాల పర్శరాములుగౌడ్, పల్లెర్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మారం: జ్యోతిరావుఫూలే వర్ధంతిని పురస్కరిం చుకొని గౌతమీబుద్ధ ఫంక్షన్‌హాల్లో ఆయన చిత్రప టానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సేవాదళ్ జిల్లాఅధ్యక్షుడు బొల్లి స్వామి, ధార మధు, కాంపెల్లి రాజేశం, సుంచు మల్లేశం, ఇరుగురాల రాజనర్సు, సిలుమల రాజ మల్లయ్య, దూడ లచ్చయ్య, గుండా గంగయ్య, మదన్మోహన్, రామగిరి లింగయ్య, ఉప్పులేటి రాజేశం, కాంపెల్లి సతీష్, గాజుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
మంథని: స్థానిక హనుమాన్‌నగర్‌లోని జ్యోతిబాఫూలే విగ్రహం వద్ద మాజీఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో వర్థంతి సభ నిర్వహించారు. స్థానిక మంత్రి క్యాంపుఆఫీసులో ఫూలే చిత్రపటానికి కాంగ్రెస్‌నేతలు వేర్వేరుగా పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. పూలే ఆశయాలను కొనసాగి స్తామన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో వివిధ పార్టీల నేతలు మాచీడి రాజుగౌడ్, జక్కు రాకేష్, ఏగోళపు శంకర్‌గౌడ్, మిర్యాల ప్రసాద్‌రావు, పెగడ శ్రీనివాస్, పుప్పాల తిరుపతి, మంథని లక్ష్మణ్, జంజర్ల శేఖర్, అడిచర్ల సమ్మయ్య, గోటికార్ కిషన్‌జీ, మంథని సత్యం, ఎరుకల మధు, శ్రీకాంత్, అజీం పాల్గొన్నారు.