Peddapalli: నిరుపేదల గుండెల్లో నిలిచిన ఇందిరా గాంధీ
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:28 AM
కళ్యాణ్‌నగర్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నిలిచిపోయారని రామ గుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు.
ఘనంగా ఇందిరాగాంధీ జయంతి
కళ్యాణ్‌నగర్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నిలిచిపోయారని రామ గుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దూళికట్ట సతీష్ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో నిర్వహించిన ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, కాల్వ లింగస్వామి, తిప్పారపుశ్రీనివాస్, గుంపుల తిరుపతి, గుళ్ల మల్లికార్జున్, చింతల రాజిరెడ్డి పాల్గొన్నారు.
ఎలిగేడు: మండలకేంద్రంలో జయంతివేడుక లను మండల కాంగ్రెస్‌నాయకులు ఘనంగా నిర్వ హించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్రకాంగ్రెస్ యువ జనకార్యదర్శి దుగ్యాల సంతోష్‌రావు, నాయకులు కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, తాటిపల్లి రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
ధర్మారం: ధర్మారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏఎంసీ చైర్మెన్ లావుడ్య రూప్లా నాయక్ ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మెన్ అరిగె లింగయ్య, డైరెక్టర్లు కొంగ భూమయ్య, కాంపెల్లి రాజేశం, ఈదుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కమాన్‌పూర్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఆవరణలో కాంగ్రెస్ మండలశాఖ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి, స్వీట్లు పంచారు. కార్యక్ర మంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ అన్వర్, ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు ప్రజలు పాల్గొన్నారు.
ముత్తారం: మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు దొడ్డబాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేశానికి ఇందిరాగాంధీ అందించిన సేవలు ఎనలేనివని కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు దొడ్డ బాలాజీ అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బుచ్చం రావు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు వాజిద్‌పాషా, కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, తదితరులున్నారు.
యైుటింక్లయిన్‌కాలనీ: తెలంగాణ చౌరస్తాలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలతో నివా ళులు అర్పించారు. అనంతరం కేక్‌కట్ చేసి, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్, నాయకులు మారెల్లి రాజిరెడ్డి, శంకర్ నాయక్ పాల్గొన్నారు.
జూలపల్లి: మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించి, కేక్‌కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకు న్నారు. కార్యక్రమంలో నాయకులు మానుమండ్ల శ్రీనివాస్, చీదురు శ్రీనివాస్, ముమ్మాడి రవి, కొట్టె సంజీవ్ పాల్గొన్నారు.
పెద్దపల్లిటౌన్: పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూల మాలలేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె సేవలను కొనియాడారు.