Share News

Peddapalli: కోడి గుడ్డు కొనేదెలా?

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:17 AM

ముత్తారం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సామాన్య కుటుంబాల ప్రజలు మాంసా హారంగా కోడిగుడ్లను విరి విగావినియోగిస్తారు. అయితే కోడి గుడ్డు ధర రోజు రోజుకు పెరుగుతూ ఆకాశాన్ని అంటు తోంది.

Peddapalli: కోడి గుడ్డు కొనేదెలా?

- గతంతో పోలిస్తే 60శాతం పెరిగిన ధర

- ఓ పక్క కూరగాయలు.. మరోపక్క కోడు గుడ్లు

- పెరిగిన ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారులు

ముత్తారం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సామాన్య కుటుంబాల ప్రజలు మాంసా హారంగా కోడిగుడ్లను విరి విగావినియోగిస్తారు. అయితే కోడి గుడ్డు ధర రోజు రోజుకు పెరుగుతూ ఆకాశాన్ని అంటు తోంది. దీంతో సామాన్యుడు కోడిగుడ్డు కొనే పరిస్థితులు కనిపించడం లేదు. కొద్దిర ోజుల కింద రిటైల్‌ మార్కెట్లో రూ.5ఉన్న కోడిగుడ్డు ధర నేడు రూ.8కి చేరడంతో సామాన్యునికి భారంగా మారింది. అప్పుడు 30గుడ్ల ట్రే ధర రూ.150 ఉండగా, ప్రస్తుతం రూ.240కి చేరింది. గతంతో పోలిస్తే 60శాతం ధర పెరిగినట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఇక మారుమూల గ్రామాల్లోని కొన్ని దుకాణాల్లో వినియోగదారులకు రూ.9 చొప్పున అమ్ముతూ దుకాణదారులు సొమ్ము చేసుకుంటున్నారు.

ఉత్పత్తి తగ్గడం వల్లే ధరల పెరుగుదల..

కోడిగుడ్ల ఉత్పత్తి గతంతో పోలిస్తే తగ్గడంతో ధర పెరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి ఏటా కోళ్లఫారాల్లో చలిపెరగ డంవల్ల గుడ్ల ఉత్పత్తి 60 శాతానికి తగ్గుతుంది. దీంతో పాటు గత సీజన్‌లో ఫారాల్లో ఉన్న కోళ్లబ్యాచ్‌లను చాలా మంది నిర్వాహకులు తొలగిం చారు. దీంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని తెలిపారు. ఉత్పత్తి తగ్గడంతో గుడ్లకు విపరీతంగా డిమాం డ్‌ పెరిగింది. చలితీవ్రత ఇదేవిధంగా ఉంటే రానున్న రోజుల్లో గుడ్లధరలు మరింత పెరిగే అవకాశాలు న్నాయి. మరోవైపుకూరగాయల ధరలు సైతం విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలకు పచ్చడి మెతుకులే దిక్కవుతున్నాయి.

ఫ తగ్గిన అమ్మకాలు..

- కోటగిరి అంజి ప్రసాద్‌,

కిరాణ వ్యాపారి, ముత్తారం

కోడిగుడ్డు ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. సామాన్యులు కోడిగుడ్లు కొనేం దుకు ఆసక్తి చూపడంలేదు. కోడి గుడ్డుకు బదు లు ప్రత్యామ్నాయ ఆహారపదార్థాలను కొను క్కుంటున్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:17 AM