Peddapalli: ఇంటింటి సర్వేలు ఎంతో కీలకం
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:20 AM
Peddapalli: House-to-house surveys are very important
- కుష్ఠు వ్యాధి నిర్మూలన రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ సుజాత
సుల్తానాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపడు తున్న కుష్ఠువ్యాధి నిర్మూలన కార్యక్ర మాన్ని విజయవంతం చేసేందుకు ఇంటింటి సర్వేలు ఎంతో కీలకమని రాష్ట్రస్థాయి కుష్ఠు నివారణ అధికారి, డాక్టర్ సుజాత అన్నారు. కుష్టువ్యాధి నిర్మూలనలో భాగంగా డాక్టర్ సుజాత ఆధ్వర్యంలోని రాష్ట్రస్థాయి బృందం బుధవారం మండలంలోని ఐతరాజు పల్లి గ్రామంలో గర్రెపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొని వ్యాధిగ్ర స్తులతో మాట్లాడారు. వారు తీసుకుంటున్న, పొందుతున్న చికిత్సల వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులు, కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహణ కల్పిస్తూ అనుమానిత కేసులను గుర్తించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ప్రజలు ఎలాంటి లక్షణాలు కనిపించినా భయపడకుండా వెంటనే వైద్యసిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి సంబంధించి డాక్టర్లతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో డీపీఎంవో దేవ్‌సింగ్, మెడికల్‌ఆఫీసర్ డాక్టర్ ఉదయ్‌కుమార్, ఎంఎల్ హెచ్‌పీ డాక్టర్ సంతోషన్, ఏఎన్‌ఎం షబనాతబస్సుమ్, ఆశ కార్యకర్తలు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.