Share News

Peddapalli: గొప్ప ఆర్థిక, సామాజిక వేత్త దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:21 AM

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 25 (ఆంధ్ర జ్యోతి): భారతదేశ గొప్ప సామాజిక, ఆర్థికవేత్త దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ అని బీజేపీ పెద్దపల్లి జిల్లాకార్యదర్శి సోమారపు లావణ్య అన్నారు.

Peddapalli: గొప్ప ఆర్థిక, సామాజిక వేత్త దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 25 (ఆంధ్ర జ్యోతి): భారతదేశ గొప్ప సామాజిక, ఆర్థికవేత్త దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ అని బీజేపీ పెద్దపల్లి జిల్లాకార్యదర్శి సోమారపు లావణ్య అన్నారు. దీన్‌దయాల్‌ ఉపా ధ్యాయ జయంతి సందర్భంగా గురువారం శివాజీనగర్‌లోని బీజేపీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుల్వలక్ష్మీనర్సయ్య, మహ వాది రామన్న, అరుణ్‌కుమార్‌, చంద్రశే ఖర్‌, సునీల్‌, శ్రావణ్‌, రాజు, రమేష్‌ పాల్గొన్నారు.

దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యరాణి లక్ష్మీనగర్‌లో మొక్కలు నాటారు. బీజేపీకి పునాదులు వేసిన మహానేత దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ అని కొని యాడారు. కార్యక్రమంలో బీజేపీనాయకులు మేరుగు హన్మంతుగౌడ్‌, ముస్కుల భాస్కర్‌రెడ్డి, అపర్ణ, కోడూరి రమేష్‌, శ్రీనివాస్‌, ఐలయ్య, హిమాన్ష్‌, ప్రణిత్‌, రాహుల్‌ పాల్గొన్నారు.

జూలపల్లి: మండలకేంద్రంలో గురువారం పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాద్యాయ జయంతివేడుకలను మండలబీజేపీ అధ్యక్షుడు కొప్పులమహేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు.కార్యక్రమంలో బీజేపీ నాయ కులు గుడిపాటి సంతోష్‌రెడ్డి, నల్ల గంగారెడ్డి, వేంసాని కొమురయ్య, బెజ్జెంకి రమేష్‌, పొట్యాల సందీప్‌, రాజిరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 12:21 AM