Share News

Peddapalli: ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:16 AM

సుల్తానాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి, మిల్లులకు తర లించాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు.

Peddapalli:  ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలి

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

సుల్తానాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి, మిల్లులకు తర లించాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. బుధ వారం ఆయన మండలంలోని చిన్నబొంకూరులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలను పరీక్షించి, ధాన్యా న్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని అధికా రులను ఆదేశించారు. ధాన్యం కొన్నవివరాలు ఎప్పటి కప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, రైతులకు 48గంటల్లోగా డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. హమాలీల సమస్యలు రాకుండా శ్రద్ధ పెట్టాలన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్‌, అధికారులు ఉన్నారు.

17శాతం లోపు తేమ ఉన్న ధాన్యమే తీసుకురావాలి..

పెద్దపల్లిటౌన్‌: రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని 17 శాతం లోపు తేమ వచ్చిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పొలం నుంచి నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావద్దని కలెక్టర్‌ కోరారు. తేమ ఎక్కు వగా ఉన్న వడ్లను తీసుకువచ్చి రైతులు కొనుగోలు కేంద్రా ల్లో ఇబ్బంది పడవద్దని సూచించారు. సరైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని కలెక్టర్‌ కోరారు.

హాస్టల్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

మంథని : గురుకుల ఆశ్రమ పాఠశాల పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. స్థానిక సాంఘికసంక్షేమ గురుకుల అశ్రమ పాఠశాలను ఆయన బుధవారం తనిఖీచేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. హాస్టల్‌లో విద్యార్థులకు రుచికరమైన వంటలు చేయించాలన్నారు. ప్రాంగణంలోని పిచ్చిమొక్క లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. రాబోయే 10వ తరగతి పరీక్షల్లో ప్రతివిద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా కృషిచేయాలన్నారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతిరోజు స్టడీ అవర్స్‌ నిర్వహించా లని, ముఖ్యమైన పాఠ్యాంశాలను రివిజన్‌ చేయించాలన్నారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:16 AM