Share News

Peddapalli: ప్రభుత్వాసుపత్రి సేవలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:46 PM

సుల్తానాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు.

Peddapalli:  ప్రభుత్వాసుపత్రి సేవలను వినియోగించుకోవాలి

సుల్తానాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు. సుల్తానాబాద్‌ ప్రభుత్వఅసుపత్రిని జడ్జి శుక్ర వారం సందర్శించారు. ఆస్పత్రిలో అన్ని వార్డు లను జడ్జి కలియతిరిగి ఆయావార్డుల్లో చికిత్స పొందుతున్న పేషంట్లతో మాట్లాడారు. అందు తున్న సేవల గురించి తెలుసుకున్నారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్‌ మాట్లాడుతు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రధానమంత్రి జన్‌అరోగ్య యోజన పథకం ఆయోష్మాన్‌భారత్‌, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్యసేవల గురించి పేషం ట్లకు ఆవగాహణ కల్పించారు. కార్యక్రమంలో అస్పత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ రమాదేవి, లోక్‌ ఆదాలత్‌ సభ్యులు మాడూరి ఆంజనేయులు, న్యాయవాదులు సామల రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

వైద్యసేవల పట్ల ప్రజలు

అవగాహన ఉండాలి: సీనియర్‌ సివిల్‌ జడ్జి భవాని

మంథని : వైద్యసేవల పట్ల ప్రజలు కనీస అవగాహన కల్గి ఉండాలని మంథని సీనియర్‌ సివిల్‌ జడ్జి భవాని అన్నారు. యూనివర్సల్‌ హెల్త్‌కవరేజ్‌ డే సందర్భంగా స్థానిక కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జడ్జి భవాని మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అమలు చేస్తున్న వైదసేవలు, వివిధ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీటిపై క్షేత్రస్థా యిలో వైద్య సిబ్బంది, పారాలీగల్‌ వాలింటర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వీటిలో ఏదైనా లోపాలు ఉంటే మండల న్యాయసేవా అధికార సంస్థను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అడిష నల్‌ జూనియర్‌జడ్జి సుధారాణి, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కేతిరెడి రఘోత్తంరెడ్డి, డాక్టర్‌ మాధురి, ఏజీపీ అంజనేయులు, విజయ్‌కుమార్‌, కటకం శ్రీనివాస్‌, శశిభూషణ్‌ కాచే, వ్యాస్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వాసుపత్రి సేవలను

వినియోగించుకోవాలి..

జిల్లా అదనపు న్యాయమూర్తి

కోల్‌సిటీ : ప్రజలకు మెరుగైనవైద్య సహాయం అందిస్తున్న ప్రభుత్వాసుపత్రి సేవ లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి డాక్టర్‌ టీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. సార్వత్రిక వైద్యరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్ర వారం గోదావరిఖని అదనపుజిల్లా న్యాయ స్థానంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేద, ధనిక, పట్టణ, గ్రామీణ తేడాలేకుండా ప్రతిఒక్కరికి వైద్యం అందిం చడం ప్రభుత్వాలవిధి అని, దీనినిఅందరూ సద్విని యోగం చేసుకోవాలన్నారు. ప్రతిఒక్కరికీ ఆరోగ్య సేవ లు అందేలా చూడడం, వైద్యఖర్చుల వల్ల పేదరికం బారిన పడకుండా ప్రజలను కాపాడడం దీని ఉద్దేశ్య మన్నారు. కోర్టుసీఈవో శ్రీనివాసరాజు, సూపరింటెం డెంట్‌ శ్రీధర్‌, సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:46 PM