Peddapalli: ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణానికి శంకుస్థాపన
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:26 AM
పెద్దపల్లిటౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో బస్ డిపో నిర్మాణం పనులను బుధవారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రాంభించారు.
పెద్దపల్లిటౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో బస్ డిపో నిర్మాణం పనులను బుధవారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రాంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ డిపోకు నాలుగు ఎకరాల పైచీలుకు స్థలం కేటాయించినట్లు తెలిపారు. చిరకాల వాంచ అయిన ఆర్టీసీబస్సు డిపో ఏర్పాటుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎమ్ రాజు, డీఎం నాగభూషణం, మల్లేశం, భూపతిరెడ్డి, నబీసా, కొమ్ము సుధాకర్, తదితరులున్నారు.
స్థలం, ఇళ్లు మంజూరు చేయాలి..
కాల్వశ్రీరాంపూర్: తమకు జాగా చూపించి ఇళ్లు మంజూరు చేయాలని బుధవారం కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన మాస్టిన్ కులస్తులు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు వినతిపత్రం అందించారు. తాము 80కుటుంబాలుగా ఉన్నామని ప్రస్తుతం పూరిగుడిసెల్లో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాలు ఇప్పించి, నిర్మాణాలకు నిధులు అందజేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మండల కేంద్రంలో ప్రభుత్వభూమి ఉంటే అధికారులతో సర్వే చేయించి ఇల్లు లేని వారికి ఇళ్లకు స్థలంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు సహకరిస్తానని ఆయన వారికి హామీఇచ్చారు.