Share News

Peddapalli: కక్షిదారులకు రాజీ మార్గమే రాజ మార్గం

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:54 PM

మంథని, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గమని పెద్దపల్లిజిల్లా ప్రధానన్యాయ మూర్తి సునీత కుంచాల స్పష్టం చేశారు.

Peddapalli:  కక్షిదారులకు రాజీ మార్గమే రాజ మార్గం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

మంథని, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గమని పెద్దపల్లిజిల్లా ప్రధానన్యాయ మూర్తి సునీత కుంచాల స్పష్టం చేశారు. మంథని కోర్టు ఆవరణలో శనివారంజరిగిన జాతీయ మెగాలోక్‌ అదాలత్‌ లో జిల్లా ప్రధానన్యాయమూర్తి సునీత మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్‌లో కక్షిదారులు ఇరువురు స్నేహపూర్వ వాతా వరణంలో కలుసు కొని వారి సమస్య లను పరిష్కరించు కోవడం సంతోషకర మన్నారు. లోక్‌ అదాలత్‌లో 271 వివిధ రకాల కేసు లు పరిష్కారం అయ్యాయన్నారు. కార్యక్రమంలో మంథని సీనియర్‌ సివిల్‌ జడ్జి వీ భావని, అడిషనల్‌ జూనియర్‌సివిల్‌జడ్జి ఏ సుధారాణి, ద్వితీయశ్రేణి న్యాయాధికారి అనురాధ, ఆర్డీవో సురేష్‌, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడుహరిబాబు, తహసీల్దార్‌ కుమార స్వామి, న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌లతో సత్వర న్యాయం..

- జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేష్‌

సుల్తానాబాద్‌: లోక్‌అదాలత్‌తో ఇరువర్గాలకు సత్వర న్యాయం అందుతుందని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జూనియర్‌ సివిల్‌జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు. శనివారం జాతీయలోక్‌అదాలత్‌ పురస్కరించుకుని మండ ల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మున్సిఫ్‌ కోర్టుఆవరణలో లోక్‌అదాలత్‌ నిర్వహించారు. పలు క్రిమి నల్‌, చెక్‌బౌన్స్‌, కుటుంబ తగాదాలు తదితరకేసులను పరి ష్కరించినట్లు కోర్టుఅధికారులు తెలిపారు. కార్యక్రమంలో బార్‌అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి బోయినిభూమయ్య, సెకండ్‌క్లాస్‌ మెజిస్ర్టేట్‌ నేరెళ్లశంకరయ్య, లోక్‌అదాలత్‌ సభ్యులు మాడూరి ఆంజనేయులు, చీకటి సంతోష్‌కుమార్‌, న్యాయవాదులు పడాల శ్రీరాములు, ఒడ్నాల రవీందర్‌, జోగుల రమేష్‌, ఆవునూరి సత్యనారాయణ, ఆవులశివకృష్ణ, సామాల రాజేంద్రప్రసాద్‌, మల్యాల కరుణాకర్‌, స్నేహ, పోలీస్‌ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:55 PM