Share News

Peddapalli: యూరియా కోసం రైతుల పాట్లు

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:04 AM

కాల్వశ్రీరాంపూర్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులు పడిగాపు కాస్తు న్నారు. మండలంలోని కూనా రం సొసైటీకి యూరియా రావ డంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు బుధవారం తెల్లవారు జాము నుంచే భారీ సంఖ్యలో క్యూకట్టారు.

Peddapalli:   యూరియా కోసం రైతుల పాట్లు

కాల్వశ్రీరాంపూర్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులు పడిగాపు కాస్తు న్నారు. మండలంలోని కూనా రం సొసైటీకి యూరియా రావ డంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు బుధవారం తెల్లవారు జాము నుంచే భారీ సంఖ్యలో క్యూకట్టారు. ఇక్కడికి273బస్తాల యూరియా రాగా రైతులు వందలాదిగా ఎగబడ్డారు. సొసైటీకి వచ్చిన యూరియాకు రెట్టింపు సంఖ్యలో రైతులు రావడంతో ఎస్‌ఐ వెంకటేష్‌ తమ సిబ్బందితో వచ్చి రైతులకు సర్దిచెప్పి గొడవజరగకుండా చర్యలుచేపట్టి సరఫరా సజావుగా సాగేలాచూశారు. ఇందులో ఒక్కొక్కరికి రెండుబస్తాలు ఇవ్వ డంతో పంటలకు సరిపోవని రైతులు వాపోయారు. మరికొం దరు యూరియా అందక వెనుతిరిగారు. ఈవిషయంపై సింగి ల్‌విండోచైర్మన్‌ గజవెల్లి పురుషోత్తం మాట్లాడుతూ త్వరలో మరోరెండు యూరియాలోడ్లు కూనారం సొసైటీకి వస్తాయని, అవిరాగానే మిగితా రైతులకు అందిస్తామని తెలిపారు.

ముత్తారం: మండలకేంద్రంలోని సింగిల్‌విండో కార్యాల యానికి బుధవారం ఉదయమే రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఒక్కో రైతుకు ఒక్క బస్తా యూరియా ఇచ్చారు. ఒక్కబస్తా ఇస్తేఎలాగని అధికారులను ప్రశ్ని స్తున్నారు. త్వరలోనే రైతులకుసరిపడా యూరియా వస్తుందని, అధైర్యపడవద్దని సింగిల్‌విండో చైర్మన్‌ అల్లాడి యాదగిరిరావు తెలిపారు.

ధర్మారం: మండలంలోని రామయ్యపల్లి డీసీఎంఎస్‌ కేంద్రానికి 270బస్తాలు రాగా వాటి కోసం రైతులు బుధవారం ఉదయం 5గంటలకే సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. దాదాపు 5వందల మంది రైతులు క్యూలో వేచి ఉన్నారు. మధ్యహ్నం వరకు 270యూరియా బస్తాలు పంపిణీ చేయగా మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు.

Updated Date - Sep 04 , 2025 | 01:04 AM