Share News

peddapalli : రైతులకు తేమ కష్టాలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:27 AM

సుల్తానాబాద్‌/ముత్తారం, నవంబరు 6 (ఆంధ్ర జ్యోతి): ఈ సీజన్‌లో పత్తి, వరి రైతులకు కాలం కలసి రావట్లేదు. పత్తి సాగు చేయడం ఒక ఎత్తయితే విక్రయించుకోవడం మరో సమస్యగా మారింది.

peddapalli :  రైతులకు తేమ కష్టాలు

- సీసీఐ నిబంధనలతో పేరుకుపోయిన పత్తి

- నిండాముంచిన మొంథా తుఫాను

- భారీ వర్షాలు, గాలులతో నేలవారిన పొలాలు

- పత్తి, వరికి తేమ నిబంధనలు

- అన్నదాతల కష్టాల సాగు

సుల్తానాబాద్‌/ముత్తారం, నవంబరు 6 (ఆంధ్ర జ్యోతి): ఈ సీజన్‌లో పత్తి, వరి రైతులకు కాలం కలసి రావట్లేదు. పత్తి సాగు చేయడం ఒక ఎత్తయితే విక్రయించుకోవడం మరో సమస్యగా మారింది. ఒక సీజన్‌లో పత్తికి రేటు ఉంటే మరో సీజన్‌లో పడిపోతు న్నది. వానాకాలం సీజన్‌కు సంబంధించి పత్తి పంట అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. పంట చేతి కందే సమయంలో వాతావరణంలో మార్పుల కార ణంగా అకాల వర్షాలతో దెబ్బతిన్నది. పత్తి రంగు మారడం, సరైన ధర రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అరకొరగా వచ్చిన దిగుబడిని విక్ర యించేందుకు సీసీఐ నిబంధనలు రైతులకు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. సీసీఐ నిబంధనలు చూస్తే నెలరోజుల్లో పత్తి అమ్ముకునే పరిస్థితి కానరావడం లేదు. రైతు సాగు చేసిన ఎకరం పత్తిలో 7 క్వింటాళ్ల దిగుబడినే సీసీఐ కొనుగోలు చేస్తోంది. గతంలో ఎక రానికి 12 నుంచి ఆపై క్వింటాలను పరిగణలోకి తీసు కుని ప్రభుత్వం మద్దతు ధరను చెల్లించింది. ప్రస్తుత సీజన్‌కు కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటా నని మెలిక పెడుతూ ఆన్‌లైన్‌ నమోదు చేస్తున్నారు. దీంతో రైతుల పరిస్థితి అయో మయంగా మారింది.

జిల్లాలో 48 వేల రెండు వందల ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికా రుల రికార్డలు తెలుపుతున్నాయి. 45 వేల ఎకరాల్లో రైతులు సాగు చేసిన పత్తిపంట ఐదున్నర లక్షల క్విం టాళ్ల దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా. ఈ దిగుబడులను మూడు నియోజకవర్గాల పరిధి లోని జిన్నింగ్‌ మిల్లుల్లో విక్రయించుకోవడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రైతులకు అనుకూ లంగా సమీప కేంద్రాలలో, సీసీఐ సహకారంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సుల్తానాబాద్‌ మండలంలోని చిన్నకలువల, పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌, నిమ్మనపల్లి, నిట్టూరులో, మంథని నియోజకవర్గంలోని కమాన్‌పూర్‌ మండలం గొల్లపల్లిలో జన్నింగ్‌ మిల్లుల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు సీసీఐ నిబంధనలకు లోబడి సెం టర్లకు తీసుకురావాలని సూచిస్తున్నారు. అకాల వర్షాలతో పత్తి తడిసి రంగు మారింది. కొనుగోలు కేంద్రాల్లో 8 శాతం తేమ వచ్చిన పత్తినే కొనుగోలు చేస్తామని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి తేమ 8 శాతం ఉంటేనే రూ.8110 మద్దతు ధర చెల్లిస్తోంది. తేమ శాతం అంతరాదని రైతుల పేర్కొంటున్నారు. అయితే తేమ శాతం పెరిగిన కొద్ది మద్దతు ధర తగ్గు తుందని అంటున్నారు. ఇలా షరతులు నిబంధనలతో 12 శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలుకు సీసీఐ అనుమతిస్తోంది. మరోవైపు రైతులు ఎకరం సాగు చేసిన పత్తికి సంబంధించిన 7 క్వింటాళ్ల నిబంధన కూడా అధికారులు సడలించలేదు. ఈ రెండు నిబంధ నలతో పత్తి పంట ఎక్కడిక్కడ ఉండిపోయింది. జిన్నింగ్‌ మిల్లుల అసోసియేషన్‌ రైతులకు అనుకూ లంగా నిబంధనలు మార్చాలంటూ కొనుగోలును నిలిపివేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి

- ప్రవీణ్‌ రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి

పత్తి కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ నిబంధనలు సడలించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి. ఎకరానికి ఏడు క్వింటాళ్ల నిబంధన పరిమితిని 12క్వింటాళ్ల వరకు అనుమతించాలనే విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగే శ్వర్‌రావు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. రైతులు పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకువచ్చేట ప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ సిస్టం ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. పట్టాదారుపాస్‌ పుస్తకం, ఆధార్‌ జిరాక్స్‌ తీసుకురావాలి. పంట కొనుగోళ్ల కోసం యాప్‌ ఏర్పాటు చేశారు. క్రయవిక్రయాలు ఈ యాప్‌ ద్వారా మాత్రమే జరుగుతాయి. కౌలు రైతులు తమ పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ అధికారులను సంప్రదించి పత్రాలను అందించాలి. పత్తి రైతులు ప్రభుత్వం మద్దతు ధర కోసం సీసీఐ కేంద్రాలలోనే విక్రయించుకోవాలి. దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు.

వరి రైతుల అరిగోస

పంట కోతల వేళ భారీ వర్షాలు, గాలులతో రైతులు అరిగోస పడుతున్నారు. పంట చేతికొచ్చిన సమయానికి మొంథా తుపాన్‌ రూపంలో అన్నదాతను నట్టేట ముంచింది. ఈ తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు, గాలులకు పొలాలు నేలకొరిగి నీరు నిలిచింది. దీంతో కోత కోసేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీల్‌ హార్వెస్టర్లు పొలంలో దిగబడుతుండటంతో చైన్‌ యంత్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో చైన్‌ యంత్రాలకు డిమాండ్‌ పెరిగింది. మిషన్లు రేట్‌ను కూడా పదిశాతం పెంచి గంటకు రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. అసలే పంట దిగుబడి వస్తుం దోరాదోనని ఆందోళన మధ్య రైతులు ఇబ్బందులు పడుతుంటే హార్వేస్టర్ల రేట్లు తడిసి మోపడవుతున్నా యని ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు నేలవాలిన పొలాలను కూలీలతో కోయించే పరిస్థితి ఏర్పడింది.

పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు

- తోటపల్లి రమేష్‌, పారుపల్లి, రైతు

ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి పెట్టి వరి సాగు చేశా. ఇటీవల కురిసిన వర్షాలతో వరి నేలకొరిగింది. హార్వెస్టర్ల పొలంలోకి దిగే పరిస్థితి లేదు. నేలకొరిగిన వరిని కూలీలతో కోయిస్తున్నాను. ప్రభుత్వం ఆదుకోవాలి.

Updated Date - Nov 07 , 2025 | 12:27 AM