Peddapalli: పంటల సస్యరక్షణపై రైతులకు అవగాహన
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:05 AM
కమాన్‌పూర్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజాపూర్, గుండారం, గొల్లపల్లి గ్రామాల్లో నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా గురువారం వ్యవసాయ శాస్త్ర వేత్తలు, వ్యవసాయ అధి కారులు క్షేత్రస్థాయిలో పలువురు రైతుల పంటపొలాలను సంద ర్శించారు.
కమాన్‌పూర్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజాపూర్, గుండారం, గొల్లపల్లి గ్రామాల్లో నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా గురువారం వ్యవసాయ శాస్త్ర వేత్తలు, వ్యవసాయ అధి కారులు క్షేత్రస్థాయిలో పలువురు రైతుల పంటపొలాలను సంద ర్శించారు. ఈ సందర్భంగా విత్త నోత్పత్తి క్షేత్రాలకు మెలకువలు అందించి, వాటి ద్వారా ఉత్పత్తి అయిన విత్తనాలను తోటి రైతు లకు అందించేలా స్వయం విత్తన సమృద్ధి కార్యక్రమం నిర్వహించి నట్లు వారు తెలిపారు. సస్యరక్ష ణలో భాగంగా ఆకునల్లి, కాండం కుళ్లు పురుగులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటిని నివారించడానికి రైతు లకు పలుసూచనలు, మందులను సూచించారు. కార్యక్ర మంలో సీనియర్‌శాస్త్రవేత్త సతీష్‌చంద్ర, మండల వ్యవ సాయ అధికారి రామకృష్ణ, ఏఈవోలు అనూష, రైతులు పాల్గొన్నారు.
ఎలిగేడులో..
ఎలిగేడు: మండలంలోని ర్యాకల్‌దేవుపల్లి, శివపల్లి గ్రామాల్లో గురువారం వరిపంటలను కూనారం వ్యవ సాయ శాస్త్రవేత్త సతీష్‌చంద్ర, ఏరువాకకేంద్రం శాస్త్రవేత్త హరి కృష్ణ సందర్శించారు. ఈ క్షేత్ర పర్యటనలో రైతులకు విత్తన ఉత్పత్తిలో మెలకువలు, చీడపీడల నివారణ, సస్య రక్షణ చర్యలపై వివరించారు. పంటద్వారా వచ్చే విత్తనా లను తదుపరిపంటకు ఇతరరైతులకు నాణ్యమైన విత్తనా లను అందించాలని వారుసూచించారు. కార్యక్రమంలో మండలవ్యవసాయ అధికారిఉమాపతి, ఏఈఓలు సురేష్, గణేష్, శరణ్య, పొట్యాల రమేష్, రైతులు పాల్గొన్నారు.