Peddapalli: కొలనూర్ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలి
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:50 AM
ఓదెల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొలనూర్ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని బుధ వారం నాయకులు సికింద్రాబాద్‌లో రైల్వేచీఫ్ ప్రిన్సిపాల్ ఆపరేటింగ్ మేనేజర్ పద్మజకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఓదెల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొలనూర్ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని బుధ వారం నాయకులు సికింద్రాబాద్‌లో రైల్వేచీఫ్ ప్రిన్సిపాల్ ఆపరేటింగ్ మేనేజర్ పద్మజకు వినతిపత్రాన్ని అందజేశారు. కాజీపేట్‌నుంచి బల్లార్షావైపువెళ్లే ప్యాసింజర్ రైలును నిల పాలని కోరారు. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వైపువెళ్లే ఎక్స్‌ప్రెస్‌తోపాటు కరీంనగర్ నుంచి తిరుమల తిరుపతి వైపువెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను హాల్టింగ్ చేయాలని కోరారు. ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది ప్రజలు కొలనూర్ రైల్వేస్టేషన్ నుంచి కాజిపేట్, సిర్పూర్ మహారాష్ట్ర వైపు రైళ్లలో ప్రయాణిస్తారని అన్నారు. వారందరూ రైళ్ల సౌక ర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైల్వేబోర్డు సభ్యుడు అనమాస శ్రీనివాస్, కాంగ్రెస్‌జిల్లా ప్రధానకార్యదర్శి బైరి రవి గౌడ్, మాజీసర్పంచ్ సామ శంకర్, మాజీ కార్పొరేటర్ జన్ను మధు, జక్కుల మఽధు పాల్గొన్నారు.