Peddapalli: ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవించాలి
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:16 AM
పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ అన్నిమతాలను గౌర వించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ అన్నిమతాలను గౌర వించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం క్రిస్మమస్ పండుగ సందర్భంగా పట్టణ కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్‌హాల్‌లో నియోజ కవర్గ క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే క్షేమంగా ఉండాలని క్రైస్తవ మతపెద్దలు ప్రార్థనలుచేసి, ఆశీర్వచనం అం దించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీవోగంగయ్య, పలు మండలాల తహసీల్దార్లు, పెద్దపల్లి మున్సిపల్‌కమిషనర్ వెంకటేష్, క్రిస్టియన్ మతపెద్దలు, పలువురుక్రైస్తవులు,పలుగ్రామాల సర్పం చ్‌లు, కాంగ్రెస్‌నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి..
కాల్వశ్రీరాంపూర్ : గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులంతా పనిచేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే స్వగృహంలో మండ లంలోని పందిల్ల ఉపసర్పంచ్ ధర్మముల రవి జన్మ దినం పురస్కరించుకుని ఎమ్మెల్యే కేక్ కట్‌చేసి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, జఠిలమైన సమస్యలను తనవద్దకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మాజీఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, సర్పంచ్ మిట్టపల్లి కొమురయ్య, వార్డుమెంబర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
పారదర్శకంగా యూరియా పంపిణీ..
సుల్తానాబాద్ : ఈ యాసంగి సీజన్ నుంచి రైతులకు సరిపడా యూరియా నిలువలను ప్రత్యేకంగా రూపొందిం చిన యాప్ ద్వారా అందిం చుటకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుల్తానా బాద్ పట్టణంలో యాదవ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన హకా కేంద్రాన్ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం మేరకు ఎంతమేరకు యూరియా అవసరం ఉంటుందో ఆ మేరకు మాత్రమే ఇస్తారని చెప్పారు. కార్యక్రమంలో అధికారులతోపాటు మార్కెట్ కమిటీచైర్మన్ మినుపాల ప్రకాష్‌రావు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, కిసాన్‌సెల్ మండల అధ్యక్షుడు పన్నాల రాములు తదితరులు పాల్గొన్నారు.