Share News

Peddapalli: సీడీపీవో ఆఫీసులో ఉద్యోగుల ఇష్టారాజ్యం

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:17 AM

మంథని, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మంథని ఐసీడీఎస్‌ సీడీపీవో కార్యాలయంలో ఉద్యోగులు ఇషా ్టరాజ్యంగా వ్యవరిస్తున్నారు.

Peddapalli:  సీడీపీవో ఆఫీసులో ఉద్యోగుల ఇష్టారాజ్యం

సమయపాలన, విధులపై అలసత్వం

టూర్ల పేరిట సాకులు, సెంటర్లపై పర్యవేక్షణ కరువు

11.40 దాటినా కార్యాలయంలో ఖాళీగా దర్శినమిచ్చిన కుర్చీలు

మంథని, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మంథని ఐసీడీఎస్‌ సీడీపీవో కార్యాలయంలో ఉద్యోగులు ఇషా ్టరాజ్యంగా వ్యవరిస్తున్నారు. ఇన్‌చార్జి సీడీపీవో, సూపర్‌ వైజర్లు, ఇతరఉద్యోగులు ఎవరూ కార్యాలయంలో సమయపాలన పాటించడంలేదు. బుధవారం ఉదయం 11.40నిమిషాలు దాటినా ఉద్యోగులు ఎవరూ ఆఫీసులో విధులు నిర్వహించడానికి రాలేదు. ఉద్యోగులు ఎవరూ లేక కార్యాల యంలోని అన్నివిభాగాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈసమయంలో ఆఫీసులో ఒక స్వీపర్‌ తప్పా ఎవరూ లేరు. 11.45నిమిషాలకు ఒక సూపర్‌ వైజర్‌ కార్యాలయానికి వచ్చారు. నిత్యం ఉద్యోగులు ఇలానే తమ ఇష్టారాజ్యంగా కార్యాలయానికి వచ్చి పోతున్నారు. ఆఫీసు సమయపాలన, విధుల నిర్వహణ పట్ల వారు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. మరికొందరు సూపర్‌వైజర్లు టూర్ల పేరిట ఇటు కార్యాలయానికి రావడం లేదని, ఆటు సెంటర్ల విజిట్‌లకు వెళ్లడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఉద్యోగులు వ్యక్తిగత పనులపై వెళ్లి తొలుత లీవ్‌ తీసుకొని ఆ తర్వా త మరునాడు వచ్చి అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ను మరోప్రాంతానికి డిప్యూటేషన్‌ పంపిణీ, ఎక్క డో పనిచేస్తున్న మరోజూనియర్‌ అసిస్టెంట్‌ ను ఇక్కడి డిప్యూటేషన్‌పై బదిలీచేశారు. సీడీపీవో సైతం ఇన్‌చార్జిగా ఉండటంతో కార్యాలయంపై సరైన పర్యవేక్షణ లేక సూప ర్‌వైజర్లు, ఉద్యోగులు సమయపాలన పాటిం చకుండా, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మంథని సీడీపీవో కార్యాలయంపై సంబంధితశాఖ, జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణన లేని కారణంగా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, సూపర్‌వైజర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆఫీసు పరిస్థి తితే ఇంతదారుణంగా ఉంటే ఇంకా అంగన్‌వాడీ సెంట ర్ల నిర్వాహణ, పర్యవేక్షణ ఎంతదారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధి కారులు మంథని సీడీపీవో కార్యాలయంపై ప్రత్యేక దృష్టి సారించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించే వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నా రు. ఈవిషయంపై ఇన్‌చార్జి సీడీపీవో పుష్పలతను వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ పలుమార్లు ఫోన్‌ చేయగా ఆమె స్పందించలేదు.

Updated Date - Nov 13 , 2025 | 12:17 AM