Share News

Peddapalli: ‘ఖని’ ఆసుపత్రిలో మందుల కొనుగోల్‌మాల్‌

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:42 AM

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగులకు అవసరం లేకున్నా సుమారు రూ.30 లక్షల విలువ చేసే మందులను కొనుగోలు చేసి డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయు.

 Peddapalli: ‘ఖని’ ఆసుపత్రిలో మందుల కొనుగోల్‌మాల్‌

అవసరం లేకున్నా మందుల కొనుగోళ్లు

సెప్టిక్‌ ట్యాంక్‌లో గర్భనిర్ధారణ కిట్‌లు, ఆంపిల్స్‌, సిరంజిలు

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగులకు అవసరం లేకున్నా సుమారు రూ.30 లక్షల విలువ చేసే మందులను కొనుగోలు చేసి డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయు. ఇటీవల ఆసుపత్రిలో కాలం చెల్లిన కొన్ని మందులను బసంత్‌నగర్‌లోని బుగ్గ గుట్టల వద్ద కాల్చివేయగా, మరికొన్ని కిట్లను, ఆంపిల్స్‌ను ఆసుపత్రిలోని పని చేయని సెప్టిక్‌ ట్యాంకు కుండీల్లో పడవేసి మూతలు వేశారు. కాలం చెల్లించిన మందులను పెద్దఎత్తున ఆసుపత్రి నుంచి బసంత్‌నగర్‌లోని బుగ్గగుట్టల వద్దకు తరలించి కాల్చివేశారు. మిగిలినవి ఆసుపత్రి ఆవరణలో అక్కడక్కడ కుండీల్లో పడవేసిన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కొత్త బిల్డింగ్‌ పక్కన పని చేయని సెఫ్టిక్‌ ట్యాంకులో గర్భ నిర్ధారణ కిట్‌లు, యాంటి బయోటిక్‌ ఆంపిల్స్‌, సిరంజిలను పడవేశారు.

ఆసుపత్రికి అభివృద్ధికమిటీ లేకపోవడంతో ఆరునెలల క్రితం ఎలాంటి అనుమతులు లేకుండా లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ మందులను కొనుగోలు చేశారు. కాలం చెల్లడానికి ఆరు నెలల ముందే ఈ మందులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రోగులకు ఈ మందులను వినియోగించకుండానే వీటిని కాల్చివేశారు. ఆసుపత్రికి చెందిన ఓఉన్నతాధి కారి బలవంతంగా రికార్డులు రాయించారనే ఆరోపణ లున్నాయి. ఓ కిందిస్థాయి ఉద్యోగి తాను ఇండెంట్‌ రాయలే నంటూ మొర పెట్టుకుని సెలవులో వెళ్లిపోయారు. ఈ మందుల గోల్‌మాల్‌పై ఇటీవల డీఎంహెచ్‌వో కూడా విచారణ జరిపినట్టు తెలుస్తోంది. రూ.35లక్షల విలువలగల మందుల కొనుగోళ్లలో గోల్‌మాల్‌ జరిగినా ఇప్పటి వరకు దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానా లకు దారితీస్తోంది.

Updated Date - Sep 15 , 2025 | 12:42 AM