Peddapalli: దేవునిపల్లి జాతరకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:50 PM
పెద్దపల్లి రూరల్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
- నేడు స్వామివారి రథోత్సవం
పెద్దపల్లి రూరల్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులతో ఆలయమంతా కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సోమవారం స్వామి రథోత్సవం ఉండగా భక్తులు ఆదివారంనాడు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్, నీటివసతి, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయఈవో శంకర్ తెలిపారు. ఎలాంటిఅవాంఛనీయ సంఘటనలు జరగ కుండా పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.