Peddapalli: ప్రజాస్వామ్య బద్దంగా డీసీసీ ఎన్నిక
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:33 AM
పెద్దపల్లిటౌన్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య బద్దంగా అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు తమిళనాడు మాజీ ఎంపీ డాక్టర్ జయకుమార్, ఎమ్మెల్యే చింతకుంట రమణారావు పేర్కొన్నారు.
-తమిళనాడు మాజీ ఎంపీ డాక్టర్ జయకుమార్
పెద్దపల్లిటౌన్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య బద్దంగా అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు తమిళనాడు మాజీ ఎంపీ డాక్టర్ జయకుమార్, ఎమ్మెల్యే చింతకుంట రమణారావు పేర్కొన్నారు. స్థానిక ఆర్కే గార్డెన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లా డారు. ఏఐసీసీనిర్ణయం హర్షించదగ్గదని, రాబోయే కాలంలో సమర్ధవంత మైన నాయకుని ఎన్నుకోగలుగుతామన్నారు. జిల్లాలోని పెద్దపల్లి, రామ గుండం, మంథని నియోజకవర్గాలతో పాటు ధర్మపురి నియోజకవర్గం ధర్మా రం గ్రామంలో కూడా అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు వివరించారు. డీసీసీ ఎన్నికకు ప్రతికార్యకర్త స్వేచ్ఛగా పోటీ చేయవచ్చని, అయితే అభి ప్రాయసేకరణ అనంతరం అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వివరించారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక దరఖాస్తు కోసం ఈనెల 22వరకు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఓబీసీ సెల్ నేషనల్ కో ఆర్డినేటర్ కేతూరి వెంక టేష్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రాజేష్, టీపీసీసీ ప్రోటోకాల్ సెక్రెటరీ బసిత్, పార్టీ జనరల్ సెక్రెటరీ కాశీపాక రాజేష్, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు దాన్నాయక దామోదర్‌రావు, ఆరే సంతోష్, మార్కెట్ చైర్మన్లు మినుపాల ప్రకాష్‌రావు, ఈర్ల స్వరూప, గండు సంజీవ్, కాడర్ల శ్రీనివాస్, చిలుక సతీష్, మూల ప్రేమ్‌సాగర్‌రెడ్డి, సామ రాజేశ్వర్‌రెడ్డి, బొజ్జ శ్రీనివాస్, సదయ్య, పట్టణ అధ్యక్షుడు భూషణవేణి సురేష్‌గౌడ్, వేగోలపు అబ్బయ్యగౌడ్, ముత్యాల నరేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.