Peddapalli: జాతీయ రహదారితో పనులతో పంటల విధ్వంసం
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:29 AM
రామగిరి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆదివారంపేట్ మీదుగా చేపడు తున్న జాతీయ రహదారి పనులతో పంటలు ధ్వంసం అవుతున్నాయని గ్రామరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆదివారంపేట్ గ్రామ రైతులు
రామగిరి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆదివారంపేట్ మీదుగా చేపడు తున్న జాతీయ రహదారి పనులతో పంటలు ధ్వంసం అవుతున్నాయని గ్రామరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామశివారులోని వ్యవసాయభూములను నాగపూర్- విజయవాడ నేషనల్ హైవే నిర్మాణానికి సేకరించారు. ఆయా పనులు చేపడుతుండగా సామగ్రిని తీసుకువచ్చే భారీ వాహనాలతో రోడ్డుకు ఇరువైపులా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పత్తి మొక్కలపై, పగిలిన పత్తికాయలపై దుమ్ము, దూళి చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అతికష్టం మీద ఏరివేతకు వచ్చినా దుమ్ముతో పత్తి రంగు మారడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వపరంగా లేదా ఎన్‌హెచ్ కాంట్రాక్టర్ ద్వారా పంటకు నష్టపరిహరం కల్పించాల్సిందిగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.