Peddapalli: పేదలకు అండ కాంగ్రెస్ పార్టీ: ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:58 PM
గోదావరిఖని, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పేదలకు అండ కాంగ్రెస్ పార్టీ అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు.
గోదావరిఖని, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పేదలకు అండ కాంగ్రెస్ పార్టీ అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. అంతర్గాం మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ కుర్ర నూకరాజు, గీట్ల శంకర్ రెడ్డి, మడ్డి వెంకటేష్, కాం పెల్లి సంతోష్ శనివారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రె స్‌పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, మారెల్లి రాజిరెడ్డి, అల్లి శంకర్, దాసరి విజయ్ పాల్గొన్నారు.
కాంట్రాక్టు కార్మికులు
ప్రభుత్వానికి పునాదిలాంటి వారు..
కాంట్రాక్టు కార్మికులు ప్రభుత్వానికి పునాది లాంటి వారని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంట్రాక్టు కార్మికులు మక్కాన్ సింగ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి లాభాలవాటా నుంచి కాంట్రాక్టుకార్మికులకు రూ.5,500 ఇప్పించేందుకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చొరవ చూపడాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ మాట్లా డుతూ కాంట్రాక్టు కార్మికుల కష్టానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్‌లో మరిన్ని ప్రయోజనాలు కల్పించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.